భాకరాపేట వద్ద బద్వేలు RTC బస్సు బోల్తా సిద్దవటం మండలంలోని భాకరాపేట కల్వర్ట్ వద్ద బుధవారం బద్వేలు డిపోకు చెందిన RTC బస్సు కడపకు వెళ్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా కండక్టర్కు చెయ్యి విరిగింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న బేటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు.
#bus #accident #bus accident #rtc