#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*26. ఓం మోక్ష ప్రదాయై నమః*
సమస్త దుఃఖాలనుండి విముక్తి పొందటమే మోక్షం. జన్మ పరంపర నుండి విముక్తి కావటమే మోక్షం. ఆ ముక్తిబోధ శ్రీమద్భగవద్గీత.
ఓం త్య్రంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥
-మృత్యుంజయ మంత్రము, యజుర్వేదము
సుగంధయుక్తుడైన, సమృద్ధికరుడైన ఈశ్వరుని మేము సేవిస్తాము. అతడు పండిన దోసపండు తీగనుండి దోసపండు వేరుపడినట్లు మృత్యుబంధం నుండి మమ్ములను వేరు చేస్తాడు. అమృతత్త్వం నుండి మాత్రము వేరు చేయకుండును గాక!
దోసకాయ అప్పటి వరకు తీగతో ఉండి, పండినప్పుడు దానంతట అదే తీగనుండి విడిపోతుంది. పాదు దగ్గరే ఉంటుంది కాని పాదుకి, దానికి సంబంధం ఉండదు. మనసుని సమంగా ఉంచుకొన్నప్పుడు, నాతో సహా అంతా బహ్మమే అని సమంగా చూసినప్పుడు మనమూ అలాగే ఉంటాము.
సమదర్శినః, సమత్వం యోగముచ్యతే, సమే కృత్వా - ఇలా సమత్వం అనే మాట భగవద్గీతలో చాల సార్లు చెప్పారు. సమం = మారకపోవటం, భేదాలు లేకపోవటం, హెచ్చుతగ్గులు లేకపోవటం. సమత్వం అంటే ఏ భేదాలు లేకుండా, దోషాలు లేకుండా, మార్పు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఉండటం. మనస్సు సమంగా లేకపోతే అది బంధం, సమంగా ఉంటే అది మోక్షం. మనస్సు అలజడిగా ఉంటే అది బంధం నిశ్చలమయితే అది మోక్షం. మనస్సు అనేకదృష్టితో ఉంటే అది బంధం ఏకంగా, ఏకదృష్టితో ఉంటే అది మోక్షం. ఏకదృష్టితో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనేకదృష్టితో ఉంటే అలజడిగా ఉంటుంది.
ఇహైవ తైర్జితః సర్గో యేషాం
సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥ ౫.౧౯
పరమాత్మ (బ్రహ్మ) దోషం లేనిది, సమమైనది. ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉంటుందో, అట్టివారు బ్రహ్మములో ఉన్నవారై ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తారు. నీటితో నీరే కలుస్తుంది. నూనె కలవదు. అట్లాగే దోషం లేనివారే, సమదృష్టి గలవారే నిర్దోషమైన, సమత్వం గల పరమాత్మను పొందగలరు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలోనే ఉంటారు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. ఆత్మ కన్న భిన్నమైనది ఏదీ లేనే లేదు. ఇలా స్థిరపరుచుకొన్నవారు మరణించాక కాదు, ఈ జన్మలోనే సర్గమును అంటే సంసారాన్ని, జనన మరణాలను జయిస్తారు. అదే మోక్షం.
అర్జున విషాద యోగంతో మొదలవుతుంది భగవద్గీత. ఆ విషాదమంతా తీరిపోగా, చివరికి మోక్షసన్న్యాస యోగంతో ముగుస్తుంది. మోక్షమే చివరి మెట్టు. విషాదం జీవ లక్షణం. ఆనందం మోక్షరూపమైన పరమాత్మ లక్షణం.
ఈ తీరున మానసిక సమస్థితి కలిగిస్తూ, జన్మ పరంపర నుండి నాకు విముక్తి ప్రసాదించే గీతామాతకు భక్తి ప్రపత్తులతో అంజలి ఘటిస్తున్నాను.
జై గురుదేవ్ 🙏