ShareChat
click to see wallet page

#భక్తి సమాచారం ☦️🕉️☪️ నేటి ఆధ్యాత్మిక విశేషం "వామన జయంతి / త్రివిక్రముుని పరివర్తన ఏకాదశి" #భాద్రపద మాసంలో ముఖ్యమైన పర్వదినాలు 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పార్శ్వ ఏకాదశి / పరివర్తిని ఏకాదశి / వామన ఏకాదశి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #భాద్రపద మాస విశిష్టత 🔱🕉️🙏 ఈరోజు పరివర్తన ఏకాదశి , పార్శ్వ ఏకాదశి , వామన ఏకాదశి 🙏 భాద్రపద శుక్ల ఏకాదశిని *పరివర్తన ఏకాదశి* అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. *పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం* వలన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే *ద్వాదశే వామన జయంతి.* ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని , కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం. శ్రీ మహా విష్ణువు అది శేషు పైన శయనించి (దక్షిణాయనం లో) విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.

1.6K ने देखा
4 महीने पहले