విజయవాడలో భవానీపురం, సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వరద పరిస్థితులను పరిశీలించాను. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించాను.. ప్రజలతో మాట్లాడాను. వాళ్ళ బాధలు విన్నాను... భరోసా ఇచ్చాను. ప్రజల స్పందన ఆధారం గా అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చాను. ప్రతి ఒక్కరూ సాధారణ జీవితం గడిపే వరకు ప్రభుత్వం పని చేస్తుంది... ధైర్యం గా ఉండమని చెప్పాను. #2024APFloodsRelief