ShareChat
click to see wallet page

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. నల్గొండ గ్రామ శివారులో దాదాపు 2.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 13,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వై. సత్య కిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్సై డి. రామ్ కుమార్ బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో, జూలై 30న ఉదయం నల్గొండ గ్రామ శివారులోని మామిడి తోట వద్ద ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుండి 5 ప్యాకెట్లలో గంజాయి, ఒక మోటార్ సైకిల్, రూ. 1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చింతల గంగరాజు (29), బండారు అప్పన్న దొర (50), తాటిపాక గణేష్ (20), నేరుమల్లి అఖిల్ (21), పోలిన సాయి సతీష్ (19) లుగా గుర్తించారు. వీరు ఒడిస్సా ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తూర్పుగోదావరి జిల్లా నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ నేడు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. #తూర్పుగోదావరి #రాజమండ్రి #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

517 ने देखा
2 महीने पहले