#మర్మ దేశం ◆ విచిత్ర దేవాలయం ◆ మిస్టరీ టెంపుల్
mysterious temples in india #కమండల గణపతి దేవాలయం (చిక్కమంగళూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం)
కమండల గణపతి దేవాలయం
(చిక్కమంగళూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం)
🐀🔔🐀🔔🐀🔔🐀🔔🐀
కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉంది.
ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట,
అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని పురాణం.
ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తిర్దాన్ని బ్రహ్మ తీర్థం అని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం.
ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
🐀🔔🐀🔔🐀🔔🐀🔔🐀🔔🐀