#ధనుర్మాసం శుభాకాంక్షలు #వైకుంఠ ఏకాదశి #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
నెల్లూరు నగరంలోని రంగనాయకలపేటలోని తల్పగిరి మహా క్షేత్రములో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి పగలపత్తు ఉత్సవాల్లో పదో రోజు (29.12.2025) సాయంత్రం నాచ్చియూర్ తిరుకోలం శాతుమురై వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుచ్చి వాహనంపై శ్రీ మోహిని అవతారంలో శ్రీ రంగనాథ స్వామి వారు మొదటి ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ రామానుజాచార్యులు సన్నిధిలో శాతుమురైను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా