🙏🙏Praise the Lord🙏🙏
ప్రభువు నీతో ఉండగా దేనికి భయపడొద్దు...!!🙅🏻♂️🙏🏻
విడిపించబడలేని సమస్యలలో నీవున్నావేమో..?☹️🤔
అనుదినము ఎదురయ్యే శోధనలు నిన్ను కలవరపరుస్తున్నాయేమో..?😩🤔
నీ ముందున్న పరిస్థితులు నిన్ను క్రుంగదీస్తున్నాయేమో..?😱🤔
నిన్ను ప్రేమించే నీ ఆత్మీయుల ఆప్యాయత నీకు కరువైపోయిందేమో..?🥺🤔
భయపడకు నేస్తమా..🙅🏻♂️🙏🏻
నిన్ను ప్రేమించి, పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుచున్నాడు..🗣️🗣️
వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను.
నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను.
దిగులుపడకుము నేను నిన్ను బలపరతును.
నీకు సహాయము చేయువాడను నేనే,
నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
Isaiah(యెషయా గ్రంథము) 41:10
నీకెవరు లేరని చింతపడకు..🙅🏻♂️🙅🏻♂️
నిన్ను ప్రేమించే ప్రభువు నీకు తోడైయున్నాడు.✅✅
పరిస్థితులు నిన్ను క్రుంగదీస్తున్నప్పుడు దిగులుపడకు..🙅🏻♂️🙅🏻♂️🙏🏻
నిన్ను ప్రేమించి నిన్ను పిలిచిన ప్రభువు నిన్ను బలపరుస్తాడు.🤩✅
నీ నిస్సహాయ స్థితి చూసి కలవరపడకు..🙅🏻♂️🙏🏻
అన్ని వేళల్లో నిన్ను ఆదుకొనుదేవుడు నీకు సహాయము చేస్తాడు.🤩🙏🏻
♻️ ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న యోసేపుకు దేవుడు తోడైయుండి నడిపించాడు.
♻️ శత్రువులు, సన్నిహితులు పోరు తప్పించుకుంటూ, కొండలలో, గుహలలో, మెట్టలమీద గడుపుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదుకు దేవుడు తోడైయుండి నడిపించాడు.
సోలినవేళలలో, బలములేనప్పుడు, కృంగినవేళలలో సహాయము లేనప్పుడు, బ్రతుకే భారమైనప్పుడు భరోసా లేనప్పుడు తనను ప్రేమించిన ఎందరో భక్తులను ఆదరించి, బలపరచి, లేవనెత్తి, విడిపించి, సహాయము చేసిన దేవుడు మన దేవుడు.🙌🏻🙌🏻🙌🏻
అటువంటి దేవునిని కలిగియున్న నీవు క్రుంగిపోవుట, సోలిపోవుట, బలహీనపడుట అవసరమా..??🤔🤔
వద్దు నేస్తమా..🙅🏻♂️🙅🏻♂️
పరిస్థితులు మారిపోవచ్చు కానీ నీవు నమ్మిన ప్రభువు మారడు.🙅🏻♂️🙅🏻♂️🙏🏻
ఆయన సెలవు లేనిదే ఏదియు నీకు ఎంతమాత్రమును హాని చేయదు.🙏🏻🙏🏻
ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్సు కలిగియుండగలిగితే
ఆయనే నిన్ను బలపరుస్తాడు.🤩✅
ఆయనే నిన్ను లేవనెత్తుతాడు.🤩✅
ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు.🤩✅
ఆయనే నిన్ను విడిపిస్తాడు.🤩✅
ఆయనే నీకు సహాయము చేస్తాడు.🤩✅
కాబట్టి బలపరచి, లేవనెత్తి, విడిపించి, సహాయము చేయగలిగిన దేవునిమీద ఆధారపడి జీవిద్దాం.🙏🏻🙏🏻
పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువునుబట్టి ధైర్యముగా ముందుకు సాగుదాం.🙏🏻🙏🏻
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!!
GOD BLESS YOU.
#యేసయ్య దీవెనలు #✝జీసస్ #✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు #📕బైబిల్ వాక్యాలు