కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు కొలువై ఉన్నారు. అయితే ఆ ఏడుకొండల్లో వెంకన్న నివాసం ఉండటం వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. శేషాచలం అడవుల్లోని ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయం ఏడో శిఖరంపై ఉంది. అదేవిధంగా మన శరీరంలోని ఉండే ఏడు చక్రాలు(మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాసతం, విశుద్ధం, ఆజ్ఞ,సహస్రారం)దాటితే ఎంతో మధురానుభూతి కలుగుతుంది. ఈ ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే వెంకన్న ఏడుకొండలపై నివాసం ఉంటాడని చెబుతారు పండితులు. ఇదిలా ఉండగా ఏడు కొండలకు సైతం ఏడు రకాల పేర్లున్నాయి. ఈ సందర్భంగా ఏడుకొండల విశిష్టతలేంటి.. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శేషాచలం అడవుల్లో..
శేషాచలం అడవుల్లో..
శేషాచలం అడవుల్లో ఏడు వైవిధ్యమైన కొండలున్నాయి. అందులో
మొదటిది - అంజనాద్రి
రెండోది - వృషబాద్రి,
మూడోది - నీలాద్రి
నాలుగోది - శేషాద్రి
ఐదు - గరుడాద్రి
ఆరు - నారాయణాద్రి
సప్తమ స్థానంలో - వెంకటాద్రి అనే కొండలున్నాయి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి.. దాని వెనుక కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
అంజనాద్రి విశిష్టత..
అంజనాద్రి విశిష్టత..
హిందూ పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో అంజనాదేవి సంతానం కోసం మాతంగి మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పుష్కరకాలం పాటు కఠోర తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయుసమాన బలవంతుడైన ఆంజనేయుడికి పుత్రుడిగా జన్మనిచ్చింది. అంజనాదేవి తపస్సు చేసిన కొండ కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరొచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది.
వృషభాద్రి విశిష్టత..
వృషభాద్రి విశిష్టత..
పురాణాల ప్రకారం, కృతయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తను శ్రీహరికి పరమవీర భక్తుడు. అయితే తాను ఆ దేవదేవునితోనే యుద్ధం చేయాలని కోరడంతో.. శ్రీ మహావిష్ణువు వృషభాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో తను ఎన్ని ప్రయత్నాలు చేసినా రాక్షసుడిని సంహారం జరగకపోవడంతో ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు శ్రీహరి. సుదర్శన చక్రం మహిమ గురించి తెలిసిన వృషభాసురుడు అక్కడ ఉన్న కొండకు తన పేరు వచ్చేలా వరమివ్వాలని కోరాడు. దీంతో ఆ వరాన్ని నెరవేర్చి తనను సంహరించాడు. అందుకే ఈ కొండకు వృషభాద్రి అనే పేరొచ్చింది.
నీలాద్రి విశిష్టత..
నీలాద్రి విశిష్టత..
ఏడుకొండలలోని నీలాద్రి కొండలలో ఒకప్పుడు క్రూరమృగాల సంచారం విపరీతంగా ఉండేది. దీంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి వేంకటేశ్వరుడిని వేడుకుంది. ఆ సమయంలో వెంకన్న స్వామి నీలాద్రిలోని
#🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩