గరుడ ముక్కు కాయలు పరిహారం :-
ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి. ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కలు మనకు విరివిగా కనిపిస్తాయి. ఈ గరుడ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవి. ఈ కాయలు గరుత్మంతుని ముక్కులాగా, నాగ పడగలాగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు. అలాగే ఇంట్లో పెట్టుకునే వారు. ఈ కాయ’లకు అతీంద్రియ’ శక్తులు ఉంటాయ’ట. నర దిష్టి, నర పీడను, నర ఘోష వల్ల ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో డబ్బు నిలవక పోవడం, భార్యా భర్తల మధ్య గొడవలు ఇలా అనేక సమస్యలు వస్తాయి.
ఒక అమావాస్య రోజున 5 లేదా 11 ఎండిన గరుడ ముక్కు కాయలను సేకరించి వాటిని ఇంటికి తీసుకు వచ్చి ధూపం చూపించి వాటిని దండ లాగా గుచ్చి మరల ధూపం చూపించి ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న నర దిష్టి పోతుంది. అలాగే ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లో వారికి దిష్టి తగలేకుండా ఉంటుంది. ఇలా చేయటం వల్ల శత్రు భయాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం ప్రవాహంగా వస్తుందని పూర్వీకులు నమ్మేవారు. ఈ కాయలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో దరిదాపుల్లోకి కూడా భూత ప్రేత పిశాచులు అస్సలు రావు.
ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ’ వస్తుంది.
#తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #dosha pariharalu