తెలుసుకుందాం
8K Posts • 4M views
గ్రామ దేవతలను ఎప్పుడు అలక్ష్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ ఏడు అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం లోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్రకోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించినా, అందులో నుండే ప్రకటమై పలుకుతుంది, కోరికలు తీరుస్తుంది, వ్యాధులు నివారిస్తుంది ఆ తల్లి. పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజా తంతులతో పనిలేదు, భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, యద్భావం తద్భవతి అన్నట్లు మన భావాన్ననుసరించి కోరికలు నెరవేరుస్తుంది.గ్రామ దేవతలను పూజించి, జాతరలు, తిరునాళ్ళు, అగ్ని గుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపు వేస్తుంటారు, ఆ జాతర రోజులలో ఎవరూ ఆ గ్రామా సరిహద్దులు దాటకూడదు అని నియమం ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి, వారు వెళ్తున్న పనిని అమ్మకు చెప్పుకుని, చీకటి పడడానికి ముందే తిరిగి గ్రామానికి వస్తామని చెప్పి మరీ వెళ్ళేవారు.జాతర రోజులలో ఆ గ్రామం అంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. హరికధలు, తోలుబొమ్మలాటలు, కుస్తీలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, అనేక తినుబండారాల అమ్మకాలు, అగ్ని గుండంలో నడవడాలు, మొక్కులు తీర్చుకోవడాలు ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ప్రతీ ఇంటి వారు తమ చేతితో స్వయంగా చేసిన నైవేద్యాలు అమ్మవారికి నివేదించేవారు. విరివిగా అన్నదానాలు జరిగేవి. ఆ గ్రామమంతా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జాతర చేసుకునేవారు.మీరు జాతరలు చేసుకున్న రోజులు గుర్తున్నాయా, ఎలా జరుపుకునేవారు.ప్రతీ ఏడు రైతులు తమ పంటలో కొంత భాగం అమ్మకు ఇచ్చేవారు. అనేక కారణాల వల్ల పోరుగూళ్ళలో జీవనాన్ని సాగించే వారు కూడా తమ గ్రామదేవతల జాతరకు తప్పకుండా వెళ్ళి వచ్చేవారు. విదేశాలలో స్థిరపడిన వారు సైతం జాతరకు వచ్చి వెళ్ళేవారు. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కొందరికి తమ గ్రామం పేరు కూడా తెలీదు. తమ గ్రామదేవత పేరు కూడా తెలీదు. అనేక చోట్ల వివిధ కారణాల వల్ల గ్రామా దేవతలను పూజించడం మానేశారు. గ్రామ దేవతలా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు, పూజలు ఆగిపోయాయి. కారణాలు మీకు తెలిసినవే వాటిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కొన్ని గ్రామాలలో తమ పిల్లలకు గ్రామదేవత పేరు కూడా జతచేర్చి నామకరణం చేసేవారు. వేరే ఊళ్లలో స్థిరపడేవారు తమ గ్రామ దేవత చిత్రపటం తమ ఇళ్ళలో పెట్టుకుని పుజించుకునేవారు. అలా తరతరాలుగా తమ గ్రామ దేవత ఉనికి తెలియబడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది గ్రామదేవతకు, ప్రకృతి మాతకు చేస్తున్న అపరాధం. భయంకరమైన అంటువ్యాధులను సైతం గ్రామ పొలిమేర దాటకుండా ఆపే అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు. ప్రతీ ఇంట్లో తమ గ్రామ దేవత చిత్రపటం తప్పకుండా ఉండాలి. తరువాతి తరానికి గ్రామదేవత శక్తి, విలువ తెలియజేయాలి.మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్రబలుతున్న అంటువ్యాధులు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇకనైనా మనం గ్రామదేవతలను అలక్ష్యం చేయక పుజించుకుందాం. ఆలోచించండి ... ఈ కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని అమ్మవారిని వేడుకుందాం.మీ గ్రామదేవత పేరు, మీ గ్రామం పేరు మీకు గుర్తుందా. ఒక్కసారి భక్తితో మీ అమ్మవారి స్మరించుకోండి. మచ్చుకకు గ్రామ దేవతల పేర్లు కొన్ని స్మరించుకుందామా.. గంగమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, గండి మైసమ్మ, పెద్దమ్మతల్లి, పోచమ్మతల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అంకమ్మ పేరంటాలు, అచ్చమ్మ - పాపయ్య, అచ్చమ్మ - వాసిరెడ్డి, అలివేలమ్మ, అద్దంకి నాంచారమ్మ, ఇరుమలమ్మ, కోటమహిషమ్మ, కొండమారెమ్మ (వానదేవత), కుంతిదేవి (గొంతేలమ్మ), గోగులమ్మ, గంటాలమ్మ, గంగానమ్మ, చంద్రమ్మ,తుంగ పల్లెమ్మ, తిరుపతమ్మ - గోపయ్య, తుమ్మలమ్మ, నాంచారమ్మ, నూకాలమ్మ, నీరమ్మ,పెద్దమ్మ, పోలేరమ్మ, పుట్లమ్మ, పెద్దింటమ్మ, పల్లాలమ్మ, బుచ్చమ్మ, బతకమ్మ, మద్దిరామమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, మాలచ్చమ్మ, ముత్యాలమ్మ, ముక్కొల్లు మహాకాళమ్మ, పెనమకూరు మంగమ్మ, ముప్పాళమ్మ, యల్లమ్మదేవత, రంగమ్మ పేరంటాలు, లంకమ్మ, వీరమ్మ పేరంటాలు, వాకాలమ్మ, వేలమ్మ, శ్రీలక్ష్మీ పేరంటాలమ్మ, సరోజనమ్మ, బాలసన్యాసమ్మ, చల్లలమ్మ, యాపారమ్మ, మామిళ్ళమ్మ, ఎల్లారమ్మ,ఏవుళ్ళమ్మ... #తెలుసుకుందాం #grama devathalu #మన పండుగలు,grama devathalu,gatharalu.
14 likes
14 shares
#లలితమ్మ_మీ_ఇంట్లోకి_లేదా_దెగ్గరికి_వచ్చే_ముందు_మిమ్మల్ని_ఎలా_పరీక్షిస్తుందో_తెలుసా? #ఈ_అనుభవాలు_మీకు_కలిగాయా? అయితే అమ్మ మీ వెంటే ఉంది! 🙏 "లలితమ్మ మీ దగ్గరికి వచ్చే ముందు మిమ్మల్ని పరీక్షిస్తుందని మీకు తెలుసా? అమ్మ మన ఇంట్లోకి అడుగుపెట్టే ముందు మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని తొలగించడానికి కొన్ని చిన్న చిన్న చికాకులు కలిగిస్తుంది. ఆ పరీక్షలో గెలిస్తేనే అమ్మ తన రూపాన్ని మనకు చూపిస్తుంది. లలితమ్మ తన భక్తుల దగ్గరికి వచ్చే ముందు నేరుగా రాకుండా, కొన్ని శుభ సంకేతాల ద్వారా తన రాకను తెలియజేస్తుంది. అమ్మవారు మనల్ని అనుగ్రహించే ముందు మన భక్తి ఎంత స్థిరంగా ఉందో చూడటానికి చిన్న చిన్న పరీక్షలు కూడా పెడుతుంది. 🌸 అమ్మవారు వచ్చే ముందు పెట్టే పరీక్షలు (The Tests):- ✨ మీరు పూజ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని మీద బయలుదేరుతున్నప్పుడు అనవసరమైన ఆటంకాలు రావచ్చు. ఆ సమయంలో మీరు సహనంతో ఉంటారా లేక విసుగు చెందుతారా లేక అమ్మపై నమ్మకంతో ప్రశాంతంగా ఉంటారా అని అమ్మ చూస్తుంది. ✨ ఇంట్లో వాళ్లు మిమ్మల్ని అనవసరంగా నిందించవచ్చు. అప్పుడు మీరు తిరిగి కోప్పడితే అమ్మ దూరంగా ఉంటుంది. మౌనంగా భరిస్తే అమ్మ "నా బిడ్డ పక్వానికి వచ్చాడు" అని దగ్గరకు చేరుకుంటుంది. 🌺 అమ్మ మన దగ్గరకు వచ్చే ముందు ఇచ్చే 5 సంకేతాలు (The Signs):- ✨ 1. మీరు పూజ గదిలో లేకపోయినా, ఇంట్లో అగరుబత్తీలు వెలిగించకపోయినా.. అకస్మాత్తుగా పన్నీరు, మల్లెపూలు లేదా కస్తూరి సువాసన వస్తుంటే అది సాక్షాత్తు లలితమ్మ మీ ఇంట్లో సంచరిస్తున్నట్టు సంకేతం. ✨ 2. మీ ఇంట్లోని చిన్న పిల్లలు గోడల వైపు చూసి నవ్వుతున్నా, లేదా ఎవరో పిలిచినట్టు మీకు అనిపించినా అమ్మ మీ దగ్గరే ఉందని అర్థం. ✨ 3. ఆకస్మిక మనశ్శాంతి కలగడం అంటే ఎంతటి పెద్ద సమస్యలో ఉన్నా, అమ్మవారి ఫోటో చూడగానే లేదా ఆమె నామం తలవగానే గుండెల్లో ఒక తెలియని ధైర్యం, ప్రశాంతత అలుముకుంటే అది అమ్మ మిమ్మల్ని స్పృశించినట్టు గుర్తు. ✨ 4. మీరు ఏదైనా అనుకుని బయటకు వెళ్తున్నప్పుడు ఆకస్మికంగా పసుపు, కుంకుమ ధరించిన ముత్తైదువలు లేదా చిన్న పిల్లలు ఎదురైతే అమ్మ మీకు తోడుగా వస్తున్నట్టు సంకేతం. ✨ 5. దీపం వెలుగులో మార్పు రావడం అంటే మీరు వెలిగించిన దీపం అకస్మాత్తుగా పెద్దగా వెలగడం లేదా ఆ జ్యోతిలో ఒక ఆకారం కనిపించడం అమ్మవారి సాక్షాత్కారానికి గుర్తు. 🌺 "అందుకే పూజ గదిలో దీపం వెలిగించి అమ్మతో మాట్లాడండి, ఆమె తన ఉనికిని ఏదో ఒక రూపంలో మీకు చూపిస్తుంది." "అమ్మ మనల్ని పరీక్షించేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని ఇంకా గొప్ప భక్తులుగా మార్చడానికి" 🙏 శ్రీ మాత్రే నమః 🙏 #తెలుసుకుందాం #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #🙏🏻sri lalitha devi #☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #lalitha tripura sundari
13 likes
15 shares
*తెలుసుకోవలసిన విషయాలు* 1. తల్లిదండ్రులను పూజించాలి ఏస్థితిలోనూ దూషించరాదు. 2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. 7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. 8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. 11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. 13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. 14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. 15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. 17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. 21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు. 23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు. 28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. 30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు. 31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు. 32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. 35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. 36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. 37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. 38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. 39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు. 40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. 41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. 44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. 46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. #తెలుసుకుందాం
11 likes
16 shares