హిందూసాంప్రదాయాలు
74 Posts • 625K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
551 views 20 hours ago
వారం రోజులు - ఏ రోజు ఏం చేయాలి.......!! మానవుడు ఏ రోజు ఏం చేయాలి? ఏం చేస్తే పుణ్యఫలితం దక్కుతుంది. ఏ రోజు ఏం కార్యాలు చేయాలి..? ఏ దేవున్ని పూజించాలి..? ఈ విషయాలు నిత్యం అందరికి అవసరమే. ఏ రోజే ఏం చేయాల్లో శాస్త్రాలు వివరించాయి. ఇక ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో శివ మహా పురాణం విద్యేశ్వర సంహిత 14వ అధ్యాయం వివరించింది. దేవతల ప్రీతి కోసం 5 విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే 5 విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ 4 రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న 7 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది. ఆదివారం చేయాల్సిన కార్యాలు........ ఉత్తర దిశగా ప్రయాణం, ఉద్యోగంలో చేరడం, మంగళ కృత్యాలు, ఉత్సవాలు, నృపాభిషేకం, లోహం, చెక్క, చర్మ, ఊక పనులు, యుద్ధం, అస్తక్రర్మలు, వ్యవసాయపు పనులు, ధ్యానక్రియలు, ఔషధ సేవనం, వైద్యం, ఉల్లి, పొగాకు, మిర్చి.. వంటి తోటలు వేయడం, కెంపు ధరించడం చేయవచ్చు. ఆదివారం చేయాల్సిన పూజలు..... ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు రోగ తీవ్రతనను బట్టి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది. సోమవారం చేయాల్సిన కార్యాలు...... దక్షిణ దిక్కు ప్రయాణించడం, కృషి క్రియలు, సమస్త వాస్తు కర్మలు చేయవచ్చు. ఇంకా.. ముత్యం, స్ఫటికం, నూతులు, కాలువలు, చెరువులు, జలం, ఉపనయనం, భూమి, పైకప్పులు, సంగీతం, నృత్య, నాటకాలు, స్తంభ ప్రతిష్ట, భూ సంబంధ కార్యాలు, తెల్లని వస్త్రాలు ధరించడం, వెండి వస్తువులు ఉపయోగించడం, ముత్యాలు ధరించడం, నృత్యాది కళలు ప్రారంభించవచ్చు. సోమవారం చేయాల్సిన పూజలు..... సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. మంగళవారం చేయాల్సిన కార్యాలు.... తూర్పు దిక్కుకు ప్రయాణించడం, పగడపు ఉంగరం ధరించడం చేయవచ్చు. కోర్టు వ్యవహారాలు, ధైర్య సాహస విషయాల్లో అడుగుముందుకేయడం, అగ్ని, ఆయుధ, ఉగ్ర, అసత్యక్రియలు, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము, ధాతువులు కరిగించడం, కందులు, వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయడం.. వంటివి చేయవచ్చు. మంగళవారం చేయాల్సిన పూజలు.... ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. బుధవారం చేయాల్సిన కార్యాలు..... ఈ రోజు పడమట దిక్కుకు ప్రయాణం మంచిది. నూతన వ్యాపారాలు, యుక్తిగా కార్యాలు నిర్వర్తించవచ్చు. బంగారం మొదలైన నగలు చేయడం, వాహనం, శిల్పం, విద్య, రాజీలు, వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, దస్తావేజులు, చిత్ర గణితం, శిల్ప గణిత శాస్త్రాది విద్యలను అభ్యసించడం, అరటి, కొబ్బరి, మామిడి తోటలు పెంచడం, పెసలు మొదలైన పైర్లు వేయడం చేయవచ్చు. బుధవారం చేయాల్సిన పూజలు.... బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గురువారం చేయాల్సిన కార్యాలు..... గురువారం రోజు పడమర దిక్కు దిశగా ప్రయాణం చేయడం మంచిది. యజ్ఞయాగాది క్రియలు, వివాహాది శుభకార్యాలు, వైదిక కార్యాలు, నూతన విద్యారంభం, వృక్షదోహదక్రియలు, అలంకార ధారణ క్రియలు, గురువులను, దేవతలను పూజించడం, యుద్ధారంభం, తీర్థయాత్రలు, అక్షరాభ్యాసం, శనగలు, చెరుకు, ప్రత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించడం, పుష్యరాగం ధరించడం మొదలైనవి. దస్తావేజులు, ఒప్పంద పత్రాలు రాయడం మంచిది కాదని సంప్రదాయం. గురువారం చేయాల్సిన పూజలు... ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం కూడా శుభకరం. శుక్రవారం చేయాల్సిన కార్యాలు.... శుక్రవారం రోజున ఉత్తరం దిక్కు దిశగా ప్రయాణం మంచిది. నూతన వస్త్రాలు ధరించడం, కొనడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం శుభకరం. స్ర్తీ సంబంధ క్రియలు, ముత్యం వజ్రం, వైఢూర్యం, ఆభరణ ధారణ, సుగంధ శయ్యా భరణాలు, ఉద్యోగ కృషి, వ్యవసాయం, కాలు వలు, వివాహం, పుష్ప సంబంధమైన మంగళ కార్యాలు, ధాన్య సంబంధ పనులు ప్రారంభించడం, సాహిత్య విషయాలు, కళలు నేర్చుకోవడం మంచిది. శుక్రవారం చేయాల్సిన పూజలు... శుక్రవారం రోజు కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిది. శనివారం చేయాల్సిన కార్యాలు.... గృహ నిర్మాణాది క్రియలు చేయడం మంచిది. చెక్కడం, కొట్టడం, సీసపు పనులు, దీక్షావలం బన, తగరం, లోహపు పనులు, స్థిరమైన పనులు, ఆవులు, గేదెలు మొదలగువాని పనులు, ఇనుమునుకు సంబంధించినవి, పాప కార్యాలు, అసత్య వాదన, దాసదాసీలను చేర్చుకోవడం మొదలగు పనులకు మంచిది. శనివారం చేయాల్సిన పూజలు..... శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు. #తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
16 likes
11 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
574 views 20 hours ago
""మాసికాల_రహస్యం"" *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?* *అన్ని_మాసికాలు_పెట్టాలా?* *కొన్నిమానేయవచ్చా?* వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. *అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.* *కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. *మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.* దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు. *మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* *ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*. *ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.ఆదిత్యయోగీ* *ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.* *నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* *కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.* *యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.* *ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.* *దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.* *అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.* *సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.* *దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.* *వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.* *దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.* *మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* *నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.* *ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* *ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.* *ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* *ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.* *తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* *పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.* *ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* *ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.* *నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.* *వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.* *అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.* *ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.* *కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.* *ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* *మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.* *మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* *తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.* *కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.* ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. *ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.* *ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.* పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. *నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు.ఆదిత్యయోగీ. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.....* #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
8 likes
10 shares
#తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #om sri gurubhyo namaha ""గురువును"" ఆశ్రయించే విధి – . సాధకుడు ఆశించవలసింది గురువు దగ్గరకు వెళ్లడం ఏదో ఆశతో వెళ్లడం కాదు. ఏదో పొందాలని వెళ్లడం కాదు. నిన్ను నువ్వు కోల్పోయేందుకు వెళ్లడం. ఈ లోకంలో ప్రతి ద్వారం ఇచ్చిపుచ్చుకునే లెక్కలతో తెరుచుకుంటుంది. కానీ గురువు ద్వారం లెక్కలన్నీ వదిలేసిన వాడికే తెరుచుకుంటుంది. 1. గురువును ఆశ్రయించే సమయంలో ఆచరించవలసిన విధి గురువు దగ్గరకు వెళ్లే ముందు నీ చేతులు ఖాళీగా ఉండాలి. కానీ నీ అహంకారం, నీ తెలివితేటలు, నీ వాదనలు, నీ అంచనాలు— అన్నీ బయటే వదిలివెళ్ళాలి. గురువు దగ్గరకు వెళ్లే వాడికి నోరు తక్కువగా, చెవులు ఎక్కువగా ఉండాలి. గురువు దగ్గర ప్రశ్నలు వేయడం సాధారణం కాదు; నీ జీవితం ప్రశ్నగా నిలబెట్టడంనే అసలైన విధి. నీవు వెళ్లి “నాకు ఇది కావాలి, అది కావాలి” అంటే నువ్వు ఇంకా వ్యాపారి స్థితిలోనే ఉన్నావన్న మాట. గురువు దగ్గరకు వెళ్లిన వాడి తొలి విధి— శరణాగతి. శరణాగతి అంటే బానిసత్వం కాదు. నీ అహంకార రాజ్యానికి రాజీనామా. 2. గురువుకు సమర్పించవలసిన కానుక లేదా దక్షిణ గురువు ఎప్పుడూ నీ జేబు చూసి దీవించడు. నీ నిబద్ధత చూసి స్పందిస్తాడు. దక్షిణ అనేది డబ్బు కాదు. బంగారం కాదు. వస్తువులు కాదు. దక్షిణ అంటే— గురువు చెప్పిన ఒక్క మాటను నీ జీవితంలో అమలు చేయడం. గురువు దగ్గర పెట్టే దక్షిణ నీ చేతిలో ఉండదు— నీ ప్రవర్తనలో కనిపించాలి. గురువు ముందు వంచిన తల బయట అహంకారంతో లేచితే ఆ దక్షిణ శూన్యం. నిజమైన దక్షిణ అంటే— గురువు మార్గంలో నీ అలసత్వాన్ని త్యజించడం. నీ వికారాలను కట్టడి చేయడం. నీ జీవితాన్ని సాధనగా మార్చడం. 3. సాధకుడు గురువు నుండి ఏమి ఆశించాలి గురువు నుండి ధనం ఆశించవద్దు. పదవి ఆశించవద్దు. అద్భుతాలు ఆశించవద్దు. గురువు నుండి ఆశీర్వాదం మాత్రమే ఆశించాలి. ఆ ఆశీర్వాదం కూడా చేతిపై చేయి పెట్టి ఇవ్వబడదు. నీ జీవితాన్ని కుదిపి నీ అహంకారాన్ని విరిచినప్పుడు నిశ్శబ్దంగా దిగుతుంది. గురువు ఆశీర్వాదం అంటే సుఖం కాదు. అది చాలాసార్లు కన్నీళ్లు, ఒంటరితనం, నింద, విరోధం రూపంలో వస్తుంది. ఎందుకంటే గురువు పని నిన్ను సుఖపెట్టడం కాదు— నిన్ను శాశ్వతానికి సిద్ధం చేయడం. ముగింపు గురువు దగ్గరకు వెళ్లిన వాడు ఏమీ తీసుకురాకూడదు— ఏమీ తీసుకుపోవద్దు. తీసుకుపోవాల్సింది ఒక్కటే— దారి. గురువు దగ్గర నీ భవిష్యత్తు రాయబడదు; నీ అవాస్తవం చెరిపివేయబడుతుంది. ఆ రోజు నీ లోపల వెలుగు పుడుతుంది. """"'హార హార మహాదేవ్ """
14 likes
13 shares