🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
684 views
20 days ago
🪔🪔అంతర్యామి 🪔🪔 ________________________________________ #ఈ క్షణం.... 🍁వయసు పైబడే కొద్దీ గతం గొప్పదన్న భావన మనిషికి పెరుగుతుంటుంది. పాత పాటల్లో జీవం తొణికిసలాడేది... సంబంధాలు బలంగా ఉండేవి.... గాలి స్వచ్ఛం... నీరు శుభ్రం... ఎందరో గొప్పవారు పాతకాలంలో ఉండేవారు... ఆధునిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు నేడు అందుబాటులో ఉన్నా... ఆ రోజులే నయమనిపిస్తాయి. 🍁 ఏదో విధంగా మనసు గతంలోనే సంతోషం వెతుక్కుంటుంది. ప్రపంచంలోని అన్ని విషయాలు తప్పుగా తోస్తుంటాయి. అయితే, వర్తమానం అనేది గతానికి పుట్టిన శిశువేనని మరవకూడదు. గతం తలలోను, భవిష్యత్తు చేతుల్లోను ఉంటుందంటారు. గతం ఎప్పుడో వెళ్లిపోయింది. దాన్ని మనసులో, హృదయంలో మోస్తూ మనిషి తిరగక్కర్లేదు. దాని ప్రభావానికి గురవ్వాల్సిన పనీలేదు. గతానికి ఆ జ్ఞాపకం లేదు. ఉన్నదంతా మనిషి జ్ఞాపకాల్లోనే. గతంలోనే బతకడం వల్ల కలిగే ఇబ్బందేమిటంటే- భవిష్యత్తును, యాదార్ధాలను గీతలు, మరకలు పడ్డ కళ్లద్దాలతో చూసినట్లు అవుతుంది. స్పష్టత లోపిస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూసే అవకాశం ఉండదు. 🍁గతం, భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు పసివారికి ఉండవు. అందుకే వర్తమానంలో స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటారు. చిన్నికృష్ణుడి చిలిపి చేష్టలపై జరుగు పొరుగు వారి ఫిర్యాదులను విని తల్లి యశోద కన్నయ్యను పెద్ద రోటికి కట్టేసింది. కృష్ణుణ్ని చంపించాలని, మామ కంసుడు రాక్షసులిద్దర్ని పంపించాడు. ఆ ఇద్దరూ రెండు చె రూపాల్లో కృష్ణుడి ఇంటి బయట సరైన సమయం కోసం వేచి ఉన్నారు. కృష్ణుడు ఆ రోటి బండను రెండు చెట్ల మధ్యకు లాక్కుని వెళ్ళాడు. ఇంకా బలంగా కాస్త ముందుకు లాగగానే రెండు చెట్లూ కూకటి వేళ్లతో కూలిపోయాయి. రాక్షసులు నాశనమయ్యారు. ఆ ఇద్దరు రాక్షసులు- గతం, కష్టాలను, భవిష్యత్తు అనిశ్చితిని ఆయన తొలగిస్తాడని అర్థం. 🍁భవిష్యత్తు, కృష్ణ భగవానుడు రెండింటి మధ్యా నవ్వుతూ నిలబడ్డాడు, వర్తమానంలో ఉండటం అంటే ఆ భగవానుడితో ఉండటం. గతం తాలూకు గతానికి సంబంధించిన శల్య పరీక్ష చేయడంలో మనం తీరికలేకుండా ఉన్నాం. గతాన్ని జీవితంలో బంగారు క్షణాలుగా చెప్పుకోవడం లేదా ఏవో బంగారు క్షణాలను ఊహించడం ద్వారా భవిష్యత్తును కీర్తించడం... ఏ విధంగా చూసినా వాటివల్ల వర్తమానాన్ని, యధార్ధాన్ని జారవిడుచుకుంటాం. 🍁వర్తమానం గొప్ప దశ.... దీనికో ప్రయోజనముంది. తదుపరి క్షణం ఈ క్షణం గర్భం నుంచి పుడుతుంది. కోల్పోయిన తరవాత విలువ తెలుసుకోవడం కాదు చెయ్యాల్సింది.... 🍁క్షణమే బంగారు క్షణం అని మనసులో నాటుకోవాలి. 🍁జీవితమంటే గతంలో జారిపోయిన అవకాశాలు కాదు... 🍁 భవిష్యత్తులో సృష్టించుకోబోయే అద్భుతాలు. 🍁 'నా భవిష్యత్తు ఈ రోజే ప్రారంభమవుతుంది' అన్న విశ్వాస బలంతో జీవించాలి🌹 శ్రీ రామ జయ రామ జయ జయ రామ ________________________________________ HARI BABU.G _________________________________________ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #✌️నేటి నా స్టేటస్ #ఓం శివోహం... సర్వం శివమయం #📙ఆధ్యాత్మిక మాటలు #😃మంచి మాటలు