Failed to fetch language order
ఓం శివోహం... సర్వం శివమయం
2K Posts • 895K views
*శివ*..... ✨💗 *శివ నామస్మరణ మహిమ...* శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ.. “శివేతి దౌవర్ణౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే” అన్నారు... శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. దిత్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు లేవు. ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కాని వ్యాఖ్యానించలేము. 'శి' 'వ' అనేవి రెండు తిరగలి రాళ్ళలా పని చేస్తుంటాయన్నారు. తిరగలి రాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి. కాని పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు. మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావల్సిన పాపపుణ్య కర్మబీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలుంటాయో మనకేం తెల్సు.. జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెల్సు కాని అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి. జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగుచేసుకొన్న కర్మబీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా మళ్లీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారౌతాయి. కాబట్టి ఈ కర్మబీజాలని 'శి' 'వ' అనే తిరగలి రాళ్ళలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్లీ జన్మ అనేదే ఉండదని ఆది శంకరుల వారు అభయమిచ్చారు. శివ నామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది... అరుణాచల శివ..🙇‍♂️🙏🪷 #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #ఓం శివోహం... సర్వం శివమయం #🙏ఓం నమః శివాయ🙏ૐ #om Arunachala siva🙏
17 likes
11 shares
సోమవారం నాడు శివుడిని పూజిస్తే.... ఋణ బాధలు ( అప్పులు ) వదిలిపోతాయి.............!! శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు.మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి. సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. #ఓం శివోహం... సర్వం శివమయం #చిదానంద రూప శివోహం శివోహం #om Arunachala siva🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ
21 likes
16 shares
పవిత్రమైన శివుని చిహ్నాలు................!! నంది (ఎద్దు) : శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని ఎద్దు చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు. త్రిశూలము : శివ ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలములో ఉండే 3 వాడి అయిన మొనలు.. కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి. నెలవంక_చంద్రుడు : శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు_కంఠం : శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగెను. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు. రుద్రాక్ష : శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటారు. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' (శివ యొక్క మరొక పేరు) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష్ చెట్టులోకి వెళ్లినాయి. పాము : శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు.. భూత, వర్తమాన, భవిష్యత్- కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు. మూడో కన్ను: శివుని యొక్క చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. డమరుకం : శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. జటా : అట్టకట్టుకొని ఉన్న జుట్టు. సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది. ఓం నమః శివాయ..!! #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏 #ఓం శివోహం... సర్వం శివమయం #🙏ఓం నమః శివాయ🙏ૐ
14 likes
14 shares