S.HariBlr (Bangalore)
656 views
#😇My Status #🌹వేటూరి జయంతి 🌹🌷 *తెలుగు సినిమా పాటల రారాజు డాక్టర్ వేటూరి సుందర రామమూర్తి గారి జయంతి నేడు..* అలలు కదిలినా పాటే,ఆకు మెదిలినా పాటే..ఏ పాట నే రాయను బ్రతుకే పాటైన పసివాడను..అని పాడుకున్న జీవన పాటసారి *డాక్టర్ వేటూరి సుందర రామమూర్తి* గారు.. మనసు మాటకందని నాడు మధురమైన పాటౌతుంది..మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది..అన్న అజరామరమైన పల్లవులతో ఎన్నో వేల పాటలు రచించి తెలుగుసినీగేయకవితావన వసంతమూర్తి గా ఒక యుగకర్తగా పండితపామర జనులందరి చేత ప్రశంసించబడి విశ్వ విఖ్యాత పాటల రచయితగా మనీషిగా నిలిచిన స్వర్గీయ *వేటూరి సుందర రామమూర్తి గారి జయంతి* సందర్భంగా నివాళులు..