#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨
*🌹 వసంతపంచమి శుభాకాంక్షలు - విశిష్టత - ప్రార్థన 🌹*
*🍀📚 సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని, శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ వసంత, శ్రీ పంచమి శుభాకాంక్షలు అందరికి Happy Basanth Panchami to All 📚🍀*
*✍️ ప్రసాద్ భరద్వాజ*
*సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్*
*కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్*
*వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్*
*రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్*
*యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా*
*యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా*
*యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా*
*సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా*
*చదువుకునే పిల్లలకు, నిత్య జ్ఞాన సముపార్జన చేసే వారికి వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు. విశేషించి ఈ సారి 20 సంవత్సరాల తరువాత కలిసి వస్తున్న పంచగ్రహ కూటమి, శుక్రవారం మరింత ప్రత్యకతను తీసుకువచ్చాయి. ఆ రోజు చదవుల తల్లి.. సరస్వతి దేవిని పూజించడం వలన విద్యలో విద్యార్థులు, జ్ఞానంలో జ్ఞానాభిలాషులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా.. నూతన ఆవిష్కరణా ఆలోచనలు రావడం.. పాఠశాలలో... పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.*
*వసంతపంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి. అవకాశం ఉన్నవారు.. ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. పూజా మందిరంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కాని.. చిత్ర పటాన్ని కాని ఉంచాలి. ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి.. సరస్వతి అష్టోత్తరం తో అమ్మవారిని పూజించి ధూపం.. దీపం.. దీపం .. నైవేద్యం సమర్పించాలరు. ఇలా చేస్తే పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే.. వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో.. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు పొంది.. జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.*
*సరస్వతి దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య.. విజ్ఞానానికి అదిష్ఠాన దేవత. ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.*
*విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు.ఈ రోజున సరస్వతి దేవిని పూజించి ...ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.*
*🌻 కేవలం చదువుకే కాదు.. అన్నింటికీ శుభప్రదం! 🌻*
*వసంత పంచమి రోజున 'అబూజ ముహూర్తం' (ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేని రోజు) ఉంటుందని పండితులు చెబుతున్నారు.*
*శుభకార్యాలు: గృహ ప్రవేశాలు, అన్నప్రాసన, పుట్టువెంట్రుకలు తీయించడం వంటి కార్యక్రమాలకు ఇది అనుకూలం.*
*వ్యాపారం: కొత్త వ్యాపారాలు లేదా పరిశోధనలు (Research) ప్రారంభించడానికి ఈ రోజును ఎంచుకుంటారు.*
*దానగుణం: ఈ రోజున పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పలకలు దానం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది.*
🌹🌹🌹🌹🌹
*🌹 వసంత పంచమి Basant Panchami ప్రార్థన. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదితర దేవతలచే నిత్యం స్తుతింపబడుతూ సకల విద్యలకు దేవతవైన ఓ తల్లీ సరస్వతీ! మాలోని అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని రక్షించుగాక. సరస్వతీ వందనం అంటే జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతించే ప్రార్థన. అంతేకాకుండా అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానం, సృజనాత్మకత, స్పష్టమైన ఆలోచనలు ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ వసంత పంచమి Basant Panchami రోజు చేసే ప్రార్థన.*
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావ్రుతా
యా వీణా వరదండ మండితకరా.. యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాసమానా
సామే వాగ్దేవతేయం నివసతువదనే సర్వదా సుప్రసన్నా ||
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించి పత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచిమే సదా ||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమో నమః ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||
అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||
ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||
🌹🌹🌹🌹🌹
*Join and Fallow*
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3/
https://t.me/Spiritual_Wisdom
https://youtube.com/@ChaitanyaVijnaanam
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://aratt.ai/@chaitanyavijnanam
#ChaitanyaVijnaanam YouTube channel #Ancient Wisdom Teachings #చైతన్య విజ్ఞానం spiritual wisdom #📙ఆధ్యాత్మిక మాటలు