newsads org
563 views
18 days ago
చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు :: దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 1. రైతులకు తగినన్ని *బియ్యం మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ సన్న & దొడ్డు బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 2. రైతులకు తగినన్ని *కూరగాయల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ కూరగాయలు,ఆకుకూరలు మొ//వి నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 3. రైతులకు తగినన్ని *పూల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పూలను (పువ్వులు) నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 4. రైతులకు తగినన్ని *పండ్ల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పండ్లను,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 5. రైతులకు తగినన్ని *మక్క మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ మక్క కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 6. రైతులకు తగినన్ని *పల్లి మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పల్లి కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 7. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడీలకు మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీ పాయింట్స్,క్యాటెరింగ్ & ప్రజలందరికి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవచ్చు. 8. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునేవిధంగా, ఇతరులు ఎవ్వరూ అమ్మకుండా చట్టం చెయ్యవచ్చును. 9. రైతు కమిటీలు వేసి, మార్కెట్లు అన్నింటినీ రైతులకే అప్పజెప్పవచ్చును. ధరల నిర్ణయం,స్థిరీకరణ,నియంత్రణ మొ//వి పూర్తి అధికారాలు రైతు కమిటీలకే ఇవ్వవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు (గ్రామానికి ఒకటి, పట్టణాల్లో,నగరాల్లో వార్డుకు,డివిజన్ కు ఒకటి లేదా ప్రతీ 5,000 జనాభాకి ఒకటి) నిర్మించుకోవచ్చును. ఈ విధంగా చెయ్యడం వలన రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. మార్కెట్లకు సమయం విధించవచ్చు. ప్రతీ రోజు సాయంత్రం 6:00 నుండి రాత్రి 12:00 వరకు తెరిచి ఉంచొచ్చు. రాత్రి 12:00 నుండి ఉదయం 6:00 వరకు రైతులు విశ్రాంతి (నిద్ర) తీసుకోవచ్చును. ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు రైతులు తమ శేనుల్లో పనులు చేసుకోవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే *వరి* పండించడం తగ్గించి అన్నిరకాల పంటల్ని రైతులు పండించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం లో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే తెలంగాణ ప్రజలందరికి సరిపోతుంది! అవసరానికి మించి అధికంగా పండిస్తే మంచి ధర లభించదు. రైతులు ... *ప్రజల కోసం* వ్యవసాయం చేస్తారు. అంతేగాని, అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల కోసం, హోల్ సేల్ వ్యాపారుల కోసం, రిటైల్ వ్యాపారుల కోసం, వీధి వ్యాపారుల కోసం, చిల్లర వర్తకుల కోసం, గల్లీ వ్యాపారుల కోసం మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు. కానీ, రైతులకు తగినన్ని మార్కెట్లు లేక, ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన, రైతులు తాము కష్టపడి పండించిన పంటలను వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ------ ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యట్లేదు. ఇకమీదట చెయ్యరు కూడా!. ----- రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga #telugu (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043

More like this