S.HariBlr (Bangalore)
1K views
22 days ago
#😇My Status #భక్తి స్టేటస్ #భక్తి కథలు *భ్రమర నాదం... భక్తుడికి మోదం* *మనం దేనిని నిత్యమూ తలచుకుంటూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో చివరికి దాని లాగానే అవుతాం. దీనికి భ్రమర కీట న్యాయం ఒక ఉదాహరణ. భ్రమరం ఒక పురుగును తెచ్చి ఒక మట్టి గూట్లో పెడుతుంది. చుట్టూ మట్టి కప్పేసి ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంచుతుంది. దాని చుట్టూ జుంకారం చేస్తూ ఉంటుంది. ఆ కీటకానికి అదే, ఆ నాదమే లోకమవుతుంది. అది ఎప్పుడైనా బయటికి రావడానికి ప్రయత్నం చేసిందా భ్రమరం ఒక్క పోటు పొడుస్తుంది. ఆ బాధకు తాళలేక పురుగు లోపలే ఉండి పోతుంది. కొన్ని రోజులకు గూటిలోని కీటకం రెక్కలు తొడిగి భ్రమరంగా మారిపోతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే తుమ్మెద గుడ్డు పెట్టిన కొంతకాలానికి కాళ్లతో చిన్న కీటకంగా రూపాంతరం చెందుతుంది. భ్రమరం దానిని రక్షించుకునేందుకు మట్టి గూడులో పెట్టి, దాని చుట్టూ తిరుగుతుంది. అది చేసే భ్రమరనాదం వల్ల కీటకానికి తుమ్మెద రూపం వచ్చింది. ఇది ప్రకృతి సిద్ధమైన పరిణామం.* *తుమ్మెద ఏ విధంగా అయితే కీటకాన్ని రక్షించుకుంటుందో, అలాగే భగవంతుడు కూడా తన బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతుంటాడు. పుట్టి, పెరిగే క్రమంలో మనిషికి కష్టాలు, నష్టాలు కలుగుతుంటాయి. వీటి నుంచి తనను గట్టెక్కించేవాడు భగవంతుడని గ్రహించిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుడి సాన్నిధ్యంలో ఉంటాడు. ఈ క్రమంలో భగవంతుడికి, భక్తుడికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అయితే, మనిషి దుర్బలుడు కాబట్టి, అతను ఏ ఘనత సాధించినా దేవుడి దయవల్లే అనుకుంటాడు. భగవంతుడి మాహాత్మ్యం, విరాట్‌ స్వరూపం తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైనది భక్తి మాత్రమే! నిరంతరం భగవంతుడి గురించి పరితపించాలి. అప్పుడు ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.* ꧁భగవంతుడు꧂