👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
576 views
15 hours ago
మరణించిన సమయాన్ని బట్టి వారి జన్మల్ని తెలుసుకోవచ్చు.. ఉత్తరాయణం శుక్లపక్షం : వీళ్ళు సూర్యమార్గం గుండా బ్రహ్మలోకం వెళతారు. మళ్ళీ తిరిగిరారు.. బ్రహ్మకాలం అక్కడే ఉండి బ్రహ్మతో పాటు లయమైపోతారు.. ఉత్తరాయణం కృష్ణపక్షం ; వీళ్ళు సూర్యమార్గం గుండా వెళ్ళి స్వర్గాదిలోకాలు, తపోలోకాలు చేరుకుని, మళ్ళీ గురువుల రూపంలో , ఉత్తమ వంశాలలో, యోగుల సంతానంగా జన్మిస్తారు.. లోకొద్దరణ కోసం జీవితాలు అంకితం చేస్తారు. దక్షిణాయనం శుక్లపక్షం : పుణ్యపాపాలు పైలోకాలలో అనుభవించి మళ్ళీ తిరిగి జన్మిస్తారు.. దక్షిణాయనం కృష్ణపక్షం : వీళ్ళు సరాసరి నరకానికి వెళ్ళి కల్పాల కాలం నరకాది లోకాలలో ఉండి పురుగు పుత్ర కొండ బండ చెట్టు చేమ, జంతువులు, పశువులుగా అనేక జన్మలెత్తుతూనే ఉంటారు. ఉత్తరాయణం లో మరణం కోరేవారు అహింస, ధర్మం ఆచరించాలి, దైవోపాసన, ధ్యానం, యోగం, దానం, తపస్సు, యజ్ఞం (తపస్సు యజ్ఞం గురించి పోస్ట్స్ ఉన్నాయి చూడగలరు) వంటి పుణ్యకార్యాలు చేయాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఋషుల మాట వ్యర్థం కాదు. అసత్యం ఉండదు. #తెలుసుకుందాం