JOGU RAVEENDHRA
526 views
రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత (వీడియో) Jan 26, 2026, మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో రిపబ్లిక్ వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ మోహన్ జాదవ్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఉమర్గా టౌన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయపతాకానికి వందనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో వెనక్కి పడిపోయి, తలకు గాయమైనట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రాథమికంగా గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైనప్పటికీ, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #షేర్ చాట్ బజార్👍 #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు