JanaSena Party Telangana
537 views
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భవిష్యత్ లక్ష్యాలకు అద్దంపట్టింది. నేలపాడు ప్రాంతంలోనిలో పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలోని పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో అమరావతి నగరం సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఉంటుందని మాటిస్తున్నాము. - @PawanKalyan #RepublicDay #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే