PSV APPARAO
4.3K views
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #దైవ పూజకు వాడవలసిన పుష్పములు #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 శివుని పూజకు వాడవలసిన పుష్పములు............!! భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుష్పైః ప్రతాపశ్చ కుబ్జ కల్హార రకైస్తథా || జపాకుసుమపూజాతు శత్రూణాం మృత్యుదా స్మృతా| రోగోచ్చాటన కానీహ కరవీరాణి వై క్రమాత్ || బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్ || శమీపత్ర్రస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమైర్దత్తేై స్త్రీ యం శుభతరాం శివః!! భావం..!! తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును. ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును. జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రతయగు భార్యను అను గ్రహించును. #namashivaya777 https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V