❤️☺VAMSHI_NANI 😊❤️
1.3K views
*అరుణ కిరణ తిమిర హరణ* అరుణ కిరణ తిమిర హరణ శ్రీ సూర్య నారాయణ శ్రీ సూర్య నారాయణ lఅరుణl స్వప్రకాశమున విశ్వ వీధిలో వెలుగులు నింపే దేవుడవయ్యా తారల తళుకులు జాబిలి వెలుగులు నింగిని తోచే నీ కాంతులేగా lఅరుణl ప్రాతఃకాలపు ప్రణతులతో ప్రార్థించెదను భాస్కర ఆయురారోగ్యముల మము దీవించే దైవము నీవని తెలిసితిని lఅరుణl ఘోరాగ్ని కీలల రగిలిపోతూ జగతికి వెలుగిచ్చు త్యాగమయా జ్యోతిగ వెలిగే నీ దివ్య తేజము మదిలో నిలిపి ధ్యానింతుము lఅరుణl ఓం ఆదిత్యాయ నమః హ 🙏🙏 #👉 Saturday Motivation #🌼ఆదివారం స్పెషల్ విషెస్