❤️☺VAMSHI_NANI 😊❤️
1K views •
*అరుణ కిరణ తిమిర హరణ*
అరుణ కిరణ తిమిర హరణ
శ్రీ సూర్య నారాయణ
శ్రీ సూర్య నారాయణ
lఅరుణl
స్వప్రకాశమున విశ్వ వీధిలో
వెలుగులు నింపే దేవుడవయ్యా
తారల తళుకులు జాబిలి వెలుగులు
నింగిని తోచే నీ కాంతులేగా
lఅరుణl
ప్రాతఃకాలపు ప్రణతులతో
ప్రార్థించెదను భాస్కర
ఆయురారోగ్యముల మము దీవించే
దైవము నీవని తెలిసితిని
lఅరుణl
ఘోరాగ్ని కీలల రగిలిపోతూ
జగతికి వెలుగిచ్చు త్యాగమయా
జ్యోతిగ వెలిగే నీ దివ్య తేజము
మదిలో నిలిపి ధ్యానింతుము
lఅరుణl
ఓం ఆదిత్యాయ నమః హ 🙏🙏 #👉 Saturday Motivation #🌼ఆదివారం స్పెషల్ విషెస్
11 likes
14 shares