Gunda Lakshmi devi Ex MLA Srikakulam
723 views
కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కుమారులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు నిన్న సాయంత్రం మంగళగిరిలోని ముఖ్యమంత్రి గారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుంటూ ఇటీవల మరణించిన వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన్ను స్వయంగా వెళ్లి కలియడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ నేను విదేశీ పర్యటనలో ఉండడం వలన రాలేకపోయానని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని, నాన్నగారు లేకపోయినప్పటికీ వారి ఆశీస్సులుతో ఆయన ఆశయ సాధన కోసం మీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు . మాలో ఒకరైనా నాన్నగారు ఆశయ సాధన కోసం, మా అమ్మగారికి తోడుగా స్థానికంగా ఉండాలని స్థానిక ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంలో మేము కూడా స్థానికంగా ఉండాలని నిర్ణయించుకున్నా మని ఆయనకి తెలియచెప్పగా ఆయన కూడా మా నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు . ఇదే సందర్భంలో ప్రజలందరూ కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న సందర్భంలో దానికి సంబంధించిన లేఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకెళ్లి ఆ లేఖ ఇవ్వడం జరిగింది, దానికి ఆయన సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా తగు చర్యలు #telugudesamparty తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam