👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
574 views
14 hours ago
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏🙏 అమ్మవారి సౌందర్యం ఇలా ఉంటుంది అని వర్ణించడం కష్టమేనుట బ్రహ్మాదులకు కూడా..! "ఆశోభనా" అమ్మవారి అద్భుత నామం. "ఆశోభనా" అంటే అంతటా సౌందర్యము కలది. అమ్మవారి సౌందర్యం ఎంత అద్భుతం అంటే మన్మధుడిని కాల్చిపడేసిన శివుడిని మోహంలో పడేసేటంత అన్నారు మూకశంకరులు. దుర్గాసూక్తంలో అమ్మవారిని "తాం అగ్నివర్ణాం" అని కీర్తిస్తాం. శ్రీలలితాపంచరత్న స్తోత్రంలో శంకరాచార్యులు "ఆకర్ణదీర్ఘనయినీం" అని ప్రార్థిస్తారు. కళ్ళు చెవులదాకా సాగి ఉన్నాయి అని.. శంకరాచార్య విరచిత "సౌందర్యలహరిలో" సౌందర్యలహరి" అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే "సొగసువెల్లువ" అని తెలుస్తూంది.. అమ్మవారి సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది.. ఎంతగా అంటే ఓ శ్లోకం చూద్దాం.. శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం, వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తకకరాం, సకృన్నత్వా న త్వాం ‌‌కధమివసతాం సన్నిదధతే, మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణాః ఫణితయః "!! "శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై.. చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరము కలిగి వర అభయముద్రలు స్ఫటికమాల పుస్తకములతో కూడిన చేతులు ( 4 చేతుల అలంకారాలు ) కలిగిన నిన్ను ( నీరూపాన్ని ) ఒక్కసారైనా ధ్యానించుకోకపోతే సజ్జనులకైనా ( నోటివెంట ) తేనె పాలు ద్రాక్షల వలె మధురముగా ఉన్న మాటలెలా ( కవిత్వం ) వస్తాయమ్మా " అని... దేవతలు ఏవో కోరికలతో వెడతారుట అమ్మవారి సన్నిధికి. అమ్మవారు చిరునవ్వుతో ఏపనిమీద వచ్చారు అని అడిగితే " ఏమీ లేదమ్మా, మీ దర్శనం కోసం వచ్చాం " అంటారుట. అమ్మవారి చిరునవ్వు చూడగానే ముగ్ధులయిపోయి వచ్చిన పని మరిచిపోతారని భావం. అంత అద్భుతం అమ్మవారి చిరునవ్వు...!! #తెలుసుకుందాం #🕉 Sri Mathre Namaha 🕉 #🕉Sri Mathre Namaha 🕉