👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
5.5K views
శ్రవణ - నక్షత్రం ..........!! ఇది శ్రీ మహా విష్ణువు మరియు శ్రీలక్ష్మి యొక్క జన్మ నక్షత్రంగా పేరొందినది. ఇది దోషరహిత నక్షత్రం. ఈ నక్షత్రమునకు చంద్రుడు అధిపతి. ఈ నక్షత్రం వారికి చంద్ర మహర్దశ లో జీవనం మొదలవుతుంది. చంద్ర దశ మొత్తం 10 వత్సరములు. ఒక్కోపాదానికి రెండు వత్సరముల ఆరు నెలలు హరించగా మిగిలిన దశ మాత్రమే అనుభవములోనికి వస్తుంది. తదుపరి కుజ మహర్దశ 7 వత్సరములు, రాహు మహర్దశ 18 వత్సరములు, గురు మహర్దశ 16 వత్సరములు, శని మహర్దశ 19 వత్సరములు, బుధ మహర్దశ 17 వత్సరములు, కేతు మహర్దశ 7 వత్సరములు, శుక్ర మహర్దశ 20 వత్సరములు, రవి మహర్దశ 6 వత్సరములుగ అనుభవములోనికి వస్తాయి. వీరు కేవలం గ్రహణ, అమావాశ్య వంటి సమయాల్లో జన్మిస్తేనే శాంతి అవసరము. వీరికి 2 వవత్సరములో జ్వర భయము, 5 వ వత్సరములో కీటక భయము, 13 వత్సరములో శస్త్ర భయము, 15 వ వత్సరములో రోగ భయము, 30 నందు అపమృత్యువు కలుగును. 90 వత్సరముల వరకు పరమార్ధయము. మిధున మాసం, కృష్ణపక్ష ఏకాదశి ఆదివారం శ్రవణ ఉన్న సమయం లో సూర్యోదయమైన ఏడు ఘదియలకి గండం. ఇది దేవా గణ, అంత్య నది, మార్కట యోని కలిగినది. శ్రవణ 1 వ పాదం వారు మేష నవాంశ కావున, వీరు కొంత ధైర్యం, శత్రు జయం, శౌర్యం కలవారగును. రెండవ పాదం వృషభ నవాంశ కావున, ఔదార్యం, విద్య, కళల యందు ఆసక్తి, కాముకులు యగును. మూడవ పాదం మిధున నవాంశ కావున శాస్త్ర జ్ఞానం, వ్యాపార నైపుణ్యం ఉంటాయి. నాల్గవ పాదం వారు కటక నవాంశ కావున కొంత చంచల స్వభావం, ఉపకార బుద్ది, స్త్రీ వ్యామోహం కలవారగును. వీరికి హస్త, శ్రవణ, రోహిణి జన్మ తారలు. వీరికి చంద్రుడు అధిపతి. సోమవారం చంద్రుని వారం. కుంకుం, రక్త చందనం కలగలిపిన జలం శంఖంతో స్నానం వలన చంద్ర దోషం నుండి ఉపశమనం కలుగును. చంద్రుడికి తెల్లని బట్టలు, ముత్యాలు, చంద్రకాంతం, కర్పూరం, వెండి, పాలు, రసపధర్ధాలు, నెయ్యి ప్రీతికరమైనవి. జప సంఖ్య 10 వేలు. గౌరీ దేవి చంద్రునికి అధిదేవత. తాంత్రిక అధిదేవత దశ మహా విద్యా రూపిణియైన భువనేశ్వరి దేవి. లలిత ఉపాసకులు సాయంత్రా సమయంలో పౌర్ణమి రోజున నిండు చంద్ర బింబమును (అద్దం పుట్టుకకి కారణమైన చంద్రుడిని) అద్దంలో చూసి లలితగా భావించి ఆవాహన చేసి సహస్ర నామ యుక్తంగా పూజించి చెరకు, నవనీత నైవేద్యం తో అమ్మవారిని తృప్తి పరచిన సర్వం సిద్దించును. ll సర్వం శ్రీ దుర్గా మాత చరణారవిందార్పణమస్తు ll #🙏 Om Namo Narayana 🙏 #🙏 ఓం నమో నారాయణ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #om namo venkatesaya #తెలుసుకుందాం