Mohan
2.2K views
2 days ago
#📢మేడారం వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్..ఏంటంటే! #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ సంవత్సరం మూడుకోట్ల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేలాగా సకల ఏర్పాట్లను చేస్తున్నారు. మంత్రులు మేడారంలోని తిష్ట వేసి పనులలో వేగం పెంచి సమయానికి పనులు పూర్తి చేసేలా చూస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లలేనివారికి ఆర్టీసీ శుభవార్త ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు తరలి వెళ్తున్నారు. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారన్న అభిప్రాయంతో ఇప్పటి నుంచే మేడారం జాతరకు భక్తులు వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. జాతర సమయంలో మేడారం వెళ్లడానికి ఇబ్బంది పడే భక్తుల కోసం భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వారి కోరుకున్న చోటికి అమ్మవార్ల ప్రసాదాన్ని పంపించేందుకు tsrtc ప్రత్యేక సేవలను నిర్వహించనుంది మేడారం అమ్మవార్ల ప్రసాదం ఇంటి వద్దకే ఈ మొత్తానికి ప్రసాదం ప్యాకెట్ తో పాటు, అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) తో కూడిన కిట్ ను టి జి ఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది భక్తుల ఇంటి వద్దకే సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు www. tgsrtclogistics.co.in వెబ్సైట్లో ఆన్లైన్లో ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. లేదా టీ జి ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్స్ కౌంటర్లలో నేరుగా ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు

More like this