ARIGELA TEJA VENKATESH
546 views
నేను ఒక స్త్రీ నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది నాకూ వచ్చింది వంటింట్లో ఎవరూ ఆపలేనంత స్వేచ్చ భూగోళం నిండా కళ్లు ఆ కళ్లు ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాయి మా మనసుల పైన ఉన్న భౌగోళిక పటాలను చదువుతూ ఉంటాయి అప్పుడప్పుడూ అనిపిస్తుంది చీకట్లో కూడా కొన్ని కళ్లు మమల్ని ప్లాష్ వేసుకుని వెంటపడుతుంటాయి "అన్నీ రంగాలలో చోటు తప్పక" "ఉంటుంది వారు అడిగేవి" " తప్పకుండా" "చేస్తే " నిజమే మేము ఎప్పుడూ అర్థం కాము ఎందుకంటే వారు చూసే దారిలో మేము ఉండము నలిగిన శరీరాలతో, విరిగిపోయిన మనసుతో చెదిరిన ఆలోచనలతో ఎటూ వెళ్ళలేక ఆగిపోయి ఉంటాము వారి ఆలోచనలను కాల్చడం మొదలుపెడితే ప్రపంచం మొత్తం నల్లటి వలయాలతో సుడులు తిరుగుతూ మరొక గ్రహం లాగా మారిపోతుంది #🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃