nvs subramanyam sharma
1K views
15 days ago
🌺 సూర్యనారాయణ 🌺 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధించటం వలన కలుగు ఫలితములు అన్నియు సూర్యనారాయణుని ఆరాధనము వలన కలుగుతాయని వేదములో చెప్పబడినది. “ఉదయం బహ్మ స్వరూపవో మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంకాలే సదా విష్ణుఃత్రిమూర్తి శ్చ దివాకరవి" ఈ శ్లోకము నందు సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మవలెను, సాయంత్రం విష్ణువు వలెను, మధ్యాన్నం మహేశ్వరుడు వలెను త్రిమూర్తుల అంశతో ప్రకాశిస్తాడని చెప్పబడింది. కనుకనే సూర్యనారాయణుని ఆరాధన వలన త్రిమూర్తులను ఆరాధించి పొందు ఫలములను పొందవచ్చునని శాస్త్రఉవాచ. సూర్య నారాయణుడే అగ్ని అని "ఆదిత్య హృదయం" తెలిపింది. అగ్ని ద్వారానే దేవతలందరూ ఉపాసించబడతారు కనుక అగ్ని ఐన సూర్య భగవానుడిని ఉపాసించినా ఆరాధించినా సమస్త దేవతలను ఆరాధించినట్లే. 🕉 ఓం సూర్యాయ నమః 🕉 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞