SRINIVAS CREATIONS
1.9K views
#📝ఫేమస్ తెలుగు కవిత్వం తాత్పర్యం: భాస్కరా! ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు. ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్ళంతా బతక లేక ఈ పనులు చేయలేదు, కీర్తికోసం చేయలేదు. ఓ మంత్రి కులంలో జన్మించిన రాయన భాస్కరుడా! బాగా ఆలోచించి చూడు(ఒక పావురాన్ని కాపాడటం కోసం శరీరం నుండి మాంసం కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి. ఇంద్రుడడిగితే సహజ సిద్ధమైన కవచకుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు. రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చినవాడు దధీచి. వామనుడడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి. వీళ్ళంతా త్యాగధనులు, మహాదాతలు