Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
877 views
1 months ago
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏శివపార్వతులు -------------------------------------- *మాస శివరాత్రి విశిష్టత:* *(ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా...)* ---------------------------------------- *మాస శివరాత్రి? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దీని వలన ఉపయోగములు ఏమిటి? మాసశివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి?* --------------------------------------- *ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.* ------------------------------------- *అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.* ------------------------------------- *మహాశివుడు లయకారకుడు. లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.* ------------------------------------- *చంద్రమా మనసో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సంయమనమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.* ---------------------------------------- *మనం గమనిస్తే... అమావాస్య తిథి ముందు ఘడియాలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.* -------------------------------------- *మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే......* ---------------------------------------- *అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాదికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి.* ------------------------------------- *అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.* --------------------------------------- *అదేవిధంగా, ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.* ------------------------------------ *మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు?* ------------------------------------- *ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా* *జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణచంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.* *సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.* *వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కల్గుతుంది.* ------------------------------------- *దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలయమునకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమములో ఖచ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.* --------------------------------------- *కావున, మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసశివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందగలుగుతాము.* --------------------------------------