💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
1.1K views
2 months ago
🇮🇳 వందేమాతరం — భారత జాతి గర్వానికి ప్రతీక🇮🇳 🇮🇳భారత స్వాతంత్ర్యానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం గీతం 150 ఏళ్ల స్ఫూర్తి యుగాన్ని పూర్తి చేసుకుంది. జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య స్పూర్తిని స్మరించుకుందాం.!దేశభక్తిని నింపిన ఈ గేయాన్ని భావి తరాలకు చేరవేయడం మనందరి బాధ్యత.!! 🇮🇳మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రణ నినాదంలా నిలిచింది వందేమాతరం. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది. స్వతంత్ర సమరయోధులకు మనో బలాన్ని ఇచ్చింది. బ్రిటిషర్లను వందేమాతరం అనే మాటే భయపెట్టింది. భారతీయుల నోట మంత్రంలా మారిన వందేమాతరాన్ని పలికితే జైళ్ల పాల్జేశారు. ఈ రోజుకీ వందేమాతరం ఆలపించినా, విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది. ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ గారు మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది. పోరాట స్ఫూర్తిని నింపిన వందేమాతరం గురించి భావి తరాలకు ఘనంగా తెలియచేయాలి. ఈ గేయం శుక్రవారం అనగా 07/11/2025 నాటికి 150 ఏళ్ళు పూర్తి చేసుకొంటుంది. భారతదేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందేమాతరం ఆలపించాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరం వందేమాతర గేయాన్ని ఆలపిద్దాము. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిదీ.!!!❤️🇮🇳🙏🏻 . . . #India❤️🇮🇳 #AndhraPradesh❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #RajaBabuGarikina❤️🇮🇳 #నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #❤I love my India❤ #జనసేన పార్టీ