Vemulawada Rajanna SRRSD
1.6K views
5 months ago
దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి జన్మదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీమతి రాధాబాయి గారు సమీక్షించి, స్వయంగా పర్యవేక్షించారు. వేద పండితులు ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందజేశారు మంత్రిగారి ఆరోగ్య మరియు ఆయురారోగ్య సంపత్తుల కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #🙏ఓం నమః శివాయ🙏ૐ