PSV APPARAO
766 views
3 months ago
#భగవద్గీత గొప్పతనం #భగవత్గీత #ఇది భగవత్గీత గొప్పతనం 🔔 *కృష్ణం వందే* 🔔 *ఇదీ భగవద్గీత గొప్పదనం.....* *భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేసారు బ్రిటీషు బ్రీడు వారు! జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవాడు! తెల్లవారు జామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవాడు! అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారు! మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవాడు! రోజు కొంత బాగం భగవద్గీత చదివాక, ఎంత వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటీష్ కాపలాదారునికి ఇచ్చేవాడట!* *అలా కొన్ని రోజుల తరువాత భగత్ సింగ్ ని ఉరి తీసే రోజు రానే వచ్చింది!* *ఉరి తీసే కొన్ని గంటల ముందు రోజూ లాగే భగవద్గీత చదివి, ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి ఆ కాపలాదారునికి ఇచ్చాడు!* *అది చూసిన ఆ తెల్ల కాపలాదారుడు ఆశ్చర్యంతో...* *"అదేంటి? నువ్వు బతికున్నన్ని రోజులు ఈ పుస్తకం ఎంత వరకు చదివావో అక్కడ పేజీని మడతేసి నాకు ఇచ్చావు సరే! కానీ, ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం ఉరి* *తీస్తుంది! ఇంకా పేజీని మడతేసి ఇవ్వడం దేనికి?" అని ఉత్సూకతగా అడిగాడు!* *భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయం, ఆందోళన లేకుండా స్థిత ప్రజ్ఞతతో...* *" ఇది మాములు పుస్తకం కాదు!మనిషికి కావాల్సిన నిజమైన సంపద, ఏ దేశం వాడు దోచుకుపోలేని ఙ్ఞాన బంఢారం అంతా ఇందులోనే ఉంది! మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది! కానీ, నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు! ఎవరు నమ్మినా, నమ్మకున్నా ప్రతీ ఒక్కరిపైనా కర్మ బలంగా పని చేస్తుంది! ఒకవేళ మీరు నాకు ఉరి వేసాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కానీ, నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు! నేను ఎక్కడైతే చదవడం ఆపేసానో, ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గరి నుండి మళ్ళీ చదువుతాను! అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్ముడిని చేరుకుంటాను!" అని ధైర్యంగా సమాధానమిచ్చాడు!"* *ఈ సమాధానం విన్న ఆ కాపలాదారుడు భగత్ సింగ్ ఆత్మ విశ్వాసానికి మరింతగా ఆశ్చర్యపోయాడు...* https://youtu.be/iJBMJ-ta5Kw 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻