ఇది భగవత్గీత గొప్పతనం
3 Posts • 345 views
PSV APPARAO
624 views
#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #ఇది భగవత్గీత గొప్పతనం #భగవద్గీత గొప్పతనం #భగవత్గీత #భగవత్గీత సూక్తులు *భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు, ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.* *1. అర్జున విషాదయోగం:* ఈ అధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. (పూర్వజన్మపాపాలు తొలగుతాయి) *2. సాంఖ్య యోగం:* ఈఆధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది. (సుఖశాంతులు కలుగుతాయి) *3. కర్మయోగం:* ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ. సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. (తనవారు. చేసిన పాపాలనుకూడా పోగొడుతుంది) *4, 5. జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం:* ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి. నాల్గవ అధ్యాయం వలన భయద్వేషాలు, ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. *6. ఆత్మ సంయమ యోగం:* ఈ అధ్యాయం చదివినవారికి అన్నదాన, గోదాన, విద్యాదాన. ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు. (జ్ఞానసిద్ధి కలుగుతుంది) *7. జ్ఞాన విజ్ఞానయోగం:* జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితేచాలు, (ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది) *8. అక్షర పరబ్రహ్మయోగం:* ఈ అధ్యాయం చదివినా, విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి. (ముక్తికలుగుతుంది) *9. రాజవిద్యా రాజగుహ్యయోగం:* ఈ అధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన ఏదైన వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది. (యజ్ఞం చేసినఫలం లభిస్తుంది) *10. విభూతి యోగం:* ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది. (మహా ఐశ్వర్యం లభిస్తుంది) డైలీ విష్ ఫేస్బుక్ పేజ్ పై ప్రతి రోజూ ఒక శ్లోకం మరియు తాత్పర్యము ఇవ్వబడుతుంది, ఫేస్బుక్ పై ఫాలో అవ్వండి... *11. విశ్వరూప సందర్శనయోగం:* ఈ అధ్యాయం నిష్టగా పఠించడంవలన భూత, ప్రేత పీడలు తొలగుతాయి. *12. భక్తియోగం:* ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానదృష్టి కలుగుతుంది. (ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది) *13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం:* ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది. (కోరిన ఫలము లభిస్తుంది) *14. గుణత్రయ విభాగయోగం:* ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి. (మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది) *15. పురుషోత్తము యోగం:* ఈ అధ్యాయాన్ని భోజనంచేసేముందు పఠించాలి. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షంసిద్ధిస్తుంది. (మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది) *16. దైవాసుర సంపద్విభాగయోగం:* ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. (రాజాధిరాజాులా వెలిగిపోతారు) *17. శ్రద్ధాత్రయ విభాగయోగం :* తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆధ్యాయాన్ని పఠిస్తే మంచిది. సత్వరం ఫలితం కనిపిస్తుంది. (అనేక వ్యాధులు దూరం అవుతాయి) *18. మోక్ష సన్యాసయోగం:* నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి. అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది. (దాన, ధర్మ, యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది). #namashivaya777
11 likes
14 shares
PSV APPARAO
639 views
#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #ఇది భగవత్గీత గొప్పతనం #భగవద్గీత గొప్పతనం #భగత్ సింగ్ #భగత్ సింగ్ 🔔 *కృష్ణం వందే* 🔔 *ఇదీ భగవద్గీత గొప్పదనం.....* *భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేసారు బ్రిటీషు బ్రీడు వారు! జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవాడు! తెల్లవారు జామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవాడు! అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారు! మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవాడు! రోజు కొంత బాగం భగవద్గీత చదివాక, ఎంత వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటీష్ కాపలాదారునికి ఇచ్చేవాడట!* *అలా కొన్ని రోజుల తరువాత భగత్ సింగ్ ని ఉరి తీసే రోజు రానే వచ్చింది!* *ఉరి తీసే కొన్ని గంటల ముందు రోజూ లాగే భగవద్గీత చదివి, ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి ఆ కాపలాదారునికి ఇచ్చాడు!* *అది చూసిన ఆ తెల్ల కాపలాదారుడు ఆశ్చర్యంతో...* *"అదేంటి? నువ్వు బతికున్నన్ని రోజులు ఈ పుస్తకం ఎంత వరకు చదివావో అక్కడ పేజీని మడతేసి నాకు ఇచ్చావు సరే! కానీ, ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం ఉరి* *తీస్తుంది! ఇంకా పేజీని మడతేసి ఇవ్వడం దేనికి?" అని ఉత్సూకతగా అడిగాడు!* *భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయం, ఆందోళన లేకుండా స్థిత ప్రజ్ఞతతో...* *" ఇది మాములు పుస్తకం కాదు!మనిషికి కావాల్సిన నిజమైన సంపద, ఏ దేశం వాడు దోచుకుపోలేని ఙ్ఞాన బంఢారం అంతా ఇందులోనే ఉంది! మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది! కానీ, నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు! ఎవరు నమ్మినా, నమ్మకున్నా ప్రతీ ఒక్కరిపైనా కర్మ బలంగా పని చేస్తుంది! ఒకవేళ మీరు నాకు ఉరి వేసాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కానీ, నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు! నేను ఎక్కడైతే చదవడం ఆపేసానో, ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గరి నుండి మళ్ళీ చదువుతాను! అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్ముడిని చేరుకుంటాను!" అని ధైర్యంగా సమాధానమిచ్చాడు!"* *ఈ సమాధానం విన్న ఆ కాపలాదారుడు భగత్ సింగ్ ఆత్మ విశ్వాసానికి మరింతగా ఆశ్చర్యపోయాడు...* https://youtu.be/iJBMJ-ta5Kw 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
8 likes
15 shares