Failed to fetch language order
'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం
127 Posts • 27K views
PSV APPARAO
5K views 1 months ago
#శ్రీమద్భగవద్గీత_ భగవద్గీత సారాంశము #'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #భగవత్గీత #భగవత్గీత #భగవత్గీత లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.........!! 1) ఏమిటా విశిష్టత..? అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు. ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు. 2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..? సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో.. కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో.. ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. 3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..? ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో... ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో.. ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో.. అదే ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు. 4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..? భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు.. గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. 5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..? ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే.. భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే.. 6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా.. ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...? కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం. విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు. బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని.. ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు.. "ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం."
36 likes
25 shares
PSV APPARAO
1K views 1 months ago
#గీతా జయంతి ... శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతని ఉపదేశించిన రోజు ఇది 🙏 #గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం 'భగవద్గీత' పుట్టినరోజు 🕉️🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #గీత జయంతి *గీతా రక్షతి రక్షిత:* శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార జీవితకాలం అనగా ద్వాపర యుగంలో రెండు మనోజ్ఞ మనోహర గానాలను చేశారు. వాటిలో ఒకటి మురళీ గానం అదే వేణుగానం. రెండవది గీతా గానం. ద్వాపరయుగంలో మురళీగాన మాధుర్యాన్ని గోపికలు పూర్తిగా ఆస్వాదించి తన్మయులయ్యారు. కృష్ణునిలో ఐక్యమయ్యారు. ఆ గానం మనకు తెలియదు. ఆది వినే భాగ్యం మనకు కలుగలేదు. కాని దానిని మించినది గీతా గానం. పాడిన వారికీ పాటకూ భేదము లేదు. పరమాత్మకు గీతకు భేదము లేదు. ఇరువురిదీ అవినాభావ సంబంధము. శ్రీకృష్ణుని నిశ్వాసమే గీత. హృదయమే గీత. భగవన్ముఖారవిందమగు గీతాగాన స్రవంతిలో జలకమాడినవారి పాపజాలము నశించిపోతుంది. ముక్తి కరతలామలకమవుతుంది. గీతను శ్రవణం చేసేందుకైనా నోచుకున్న జీవరాసుల భాగ్యమే భాగ్యము. గీత ఉపదేశరూపమైన ఒక మహాలీల. ఇది ఒక కాలమునకు గానీ, దేశమునకు గాని, మతానికిగానీ, జాతికిగాని సంబంధించినది కాదు. అది సార్వజన, సార్వభౌమ, సార్వకాలీన సత్యశివసుందర భగవద్వాణి. ముల్లోకజనులకు ఉపయుక్తమైనది. సర్వ శాస్త్ర సిద్ధాంత సమన్వయ రూప గ్రంథము. సర్వ మత సంప్రదాయ తత్త్వములను పోషించేది. అన్నంటికి ప్రామాణిక గ్రంథరాజము. సకల మతములలోని ప్రధాన సూత్రాలు, ధర్మాలు ఇందులో క్రోడీకరించబడినవి. ధర్మ వృక్షమే గీత. సర్వధర్మ సమన్వయ క్షేత్రం ఈ గీత. సకల సంప్రదాయముల సమన్వయం కావున ఇది విశ్వ మత గ్రంధమై విరాజిల్లుతోంది. గీత అనే రెండక్షరాలలో ఎంతో అర్ధం నిబిబడీకృతమై ఉంది. *'గీ' కారం త్యాగరూపస్యాత్ 'త' కారం తత్త్వ బోధకం* *గీతావాక్యమిదం తత్త్వం జ్ఞేయం సర్వ ముముక్షుభిః* 'గీ' కారం త్యాగమును, 'త' కారం తత్త్వమును ఆత్మస్వ రూపంగా ఉపదేశించునది అని దీని అర్ధము. సర్వ శాస్త్రమయీ గీత అని స్కాందపురాణ వాక్యం. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అని, గేయం గీతానామ సహస్రమని ఆదిశంకరుల వారి అభిప్రాయం. గీతోపదేశం జరిగిన ప్రదేశం కురుక్షేత్ర యుద్ధ భూమి, కురుక్షేత్ర యుద్ధం ఒక విచిత్రమైన యజ్ఞం. హోమ గుండం అర్జునుని ముఖం. హోమ ద్రవ్యం గీతోపదేశం. హోత శ్రీకృష్ణుడు. ఫలం కైవల్యం. భగవంతుడు అనంతుడు. అనంతో వైవిష్ణుః అని వేదం. భగవద్వాణి కూడా అనంతమే కదా! కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణవాణి భగవద్వాణీయే. భగవద్గీత వైశిష్ట్యం అనంతం, ఆపారం, అలౌకికం. గీత ధర్మాత్ములకు రక్ష. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
12 likes
12 shares
PSV APPARAO
708 views 1 months ago
#'భగవద్గీత' సృష్టిలో ఏకైక దైవ గ్రంధం #భగవత్గీత #భగవత్గీత #భ గ వ ధ్గీ త #భగవత్ గీత సారాంశం *సుఖజీవన గీత భగవద్గీత* *డిసెంబర్ 01 సోమవారం గీత జయంతి సందర్భంగా...* సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా, పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు. "గీతా శ్రవణ పఠనాలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను' అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. భగవద్గీతకు (1.8 అధ్యాయాలున్నట్లే) 18 పేర్లున్నాయి. అది 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి. గీత అంటే...: సాక్షాత్తూ విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు. అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు, లోకానికి అందించాడు. గీత అనే వదంలో '' అంటే త్యాగం, 'తే' అంటే తత్త్వ జ్ఞానం. అంటే త్యాగాన్నీ, తత్వజ్ఞానాన్నీ బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథ ధ్వజం పై ఉన్న ఆంజనేయుడు. గీతా మాహాత్మ్యాన్ని శివుడు పార్వతికీ, విష్ణువు లక్ష్మీదేవికీ, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే సతులకు గీతా మాహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. స్నానం చెయ్యడం వల్ల శరీరంపైన ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చెయ్యడం వల్ల సంసారమనే మాలిన్యం తొలగిపోతుంది. ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ, జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి లాంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం. ఎలాగో వివరించిన గ్రంథం ఇది. కాబట్టి దీన్ని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు. మనిషిలోని కోరికలనూ, బాధలనూ నశింపజేయడానికీ, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికీ గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా, ఔషధగుళికగా వాడుకోవచ్చు. యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్దాలు పుట్టుకొస్తుంటాయి. మనం తెలిసి కానీ, తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల తక్షణమే. నశించిపోతాయి. గీతా మకరందాన్ని సేవించడమే కాదు, అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల. తీరానికి చేరుద్దాం. *https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V*
11 likes
11 shares