#🙏జై శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🙏
#💖జై శ్రీ రాధాకృష్ణ 💖 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺
#🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏
#కృష్ణాష్టమి శుభాకాంక్షలు
-------------------------------------- *రేపు అనగా శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణాష్టమి*
--------------------------------------
*శివరాత్రి పరమ శివునికి, నవరాత్రి అమ్మవారికి, రామనవమి శ్రీరామ చంద్రునికి, స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి మనం చూస్తూ ఉన్నాము. కానీ కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు. కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.* ---------------------------------------- *శ్రీకృష్ణ జన్మాష్టమి*
---------------------------------------
*తత్వం అంటే స్వభావం అని ఒక అర్ధం ఉంది. పరమాత్మ అనేది మరో అర్థం. మానవుల్లో ఒక్కొక్కరి స్వభావం ఒక్కోవి ధంగా ఉంటుంది. అందుకే కొందరి స్వభావం కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. కానీ శ్రీకృష్ణతత్వం (స్వభావం) దాదాపు అంద రికీ నచ్చుతుంది. దానికి కారణం విష్ణుమూర్తి కృష్ణావతారం దాల్చి, పరమాత్మ స్వరూపాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే పరిస్థితులు కల్పించాడు. అందుకే 'అందరి మనసుల్నీ ఆక ర్షించేవాడు' (కర్షతి చిత్తం ఇతి కృష్ణః) అనేది 'కృష్ణ' శబ్దానికి నిర్వచనంగా మారింది. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరిం చిన రోజు. కృష్ణుడి పేరుతో 'కృష్ణాష్టమి' అని, ఆయన జన్మించిన రోజు కాబట్టి 'జన్మాష్టమి' అని, బాల్యాన్ని గడిపి గోకులానికి ఆనందం కలిగించిన రోజు కాబట్టి 'గోకులాష్టమి' అనే పేర్లతో పిలుస్తారీ రోజును. ఇంకా శ్రీజయంతి అనే పేరు ఉంది.*
---------------------------------------
*ఆయన అవతరించిన సమయం ద్వాపర, కలియుగాల సంధికాలం. జన్మ ప్రదేశం కారాగారం. ఆ ముహూర్తం మేనమామకు గండం ఉన్న సమయం. ఈ కారణాలన్నింటివల్లా కృష్ణావతారం విలక్షణమై విలసిల్లింది. అవతరిం చిన క్షణం నుంచి అనుక్షణం, అడుగడుగునా గండాలతోనే గడిచిందాయన జీవితం. అయినా ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. ఫలితంగా ప్రతి సంఘటనా మానవాళికి ఒక స్ఫూర్తిగా, బోధనాంశంగా పరిణమించాయి.*
---------------------------------------
*పాలు తాగే వయసు నుంచే కృష్ణుడు రాక్షసుల దాడులను ఎదుర్కోవలసివ చ్చింది. అప్పటినుంచే దుష్ట శిక్షణ నిత్యకృత్యమైంది. నేపథ్యంలోనే పూతన, శకటా సురుడు లాంటి రాక్షసులను సంహరించాడు. మడుగులో ఉండి లోకులను హింసిస్తున్న కాళియుడి మదమణచాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించాడు. ఇన్ని చేసిందీ చిన్నవాడిగా ఉన్నప్పుడే. కని పించే వయసుకు, చేసే పను లకు పొంతన కుదరదు. చూపరులకు నమ్మకం కల గదు. అందుకే పెద్దవాడా చిన్నవాడా అనే సందిగ్ధంలో పడిపోయేవారందరూ.*
----------------------------------------
*తల్లులు తమకు ఇలాంటి బిడ్డడే కావాలని, స్నేహితులు తమకు ఇలాంటి స్నేహితులే కావాలని కోరుకుంటారు. కన్నెపిల్లలు కన్నయ్యలాంటి వాడే తనను వలపించే చెలి కాడు కావాలని కలలు కంటారు. సంసారులు తమ సంసార సాగర తరణం చేయించేవాడు శ్రీకృష్ణభగవా నుడేనని నమ్ముతారు. జీవిత చరమాంకంలో ఉన్న పండు వృద్ధులు కృష్ణ పరమాత్మే తమను ఆయనలో ఐక్యం చేసుకోవాలని కోరుకుంటారు.*
-------------------------------------
*ఇలా ఎవరి కోరికను ప్రతిబింబించే విధంగా వారు కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. - ఒక్కొక్క వయసు/ప్రాంతం వారు ఒక్కో రూపంలో/పద్ధతిలో కృష్ణుణ్ని ఆరాధిస్తారీ రోజున. ముఖ్యంగా బాలకృష్ణుడి రూపంలోనే ఎక్కువమంది ఆరాధిస్తారు. అసలు కృష్ణుడు అనగానే చాలామందికి ఆయన బాల్య రూపమే గుర్తొస్తుంది. అదీకాక ఈ పండుగ శ్రీకృష్ణుడి జన్మ సంబంధమైంది కాబట్టి అందుకు అనుగు ణంగా బాల్యోపచారాల రూపంలోనే (ఊయల లూపడం, ఇళ్ళముంగిట కృష్ణ పాదముద్రలు చిత్రించడం) ఆరాధిస్తారు.*
---------------------------------------
*ఉట్టికొట్టి వసంతాలు చల్లుకోవడం మరో రక మైన ఆరాధన. చెలిమికి, సహజీవనానికి సంకే తమైన ఈ పద్ధతిని యువకులు అనుసరిస్తారు. గృహస్థులు భక్తిప్రపత్తులతో పూజిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని పూజించి పిండివంటలు నివేదన చేస్తారు. అనంతరం బంధు మిత్రులతో విందు భోజనం చేస్తారు. సాధారణంగా ఉదయం ఉపవాసం చేసేవారు సాయంత్రం 'ఫల/అల్పా'హారం తినాలని నియమం. కానీ కృష్ణాష్టమి నాడు గృహస్థులు ఆచరించే ఉపవాసంలో విందు భోజనం ప్రత్యేకం.*
----------------------------------------
*దేవాలయాల్లో కృష్ణ విగ్రహానికి పూజలు చేస్తారు. ఈ పూజల్లో వెన్న, పాలు, పాలతో తయారుచేసిన మధుర పదార్థాలను నివేదన ద్రవ్యాలుగా వినియోగిస్తారు. కృష్ణలీలల్ని గానం చేయడం, తల్లులు తమ బిడ్డలను బాలకృష్ణు డిలా అలంకరించడం, కృష్ణుడి జీవిత ఘట్టాలను ప్రదర్శించడం, సందడి, సంతోషం, ఉత్సాహాలతో గడపడంతో ఈ పర్వం పూర్తవుతుంది.* ----------------------------------------