ఫాలో అవ్వండి
నాగుదత్త
@1284320
392
పోస్ట్
467
ఫాలోవర్స్
నాగుదత్త
11.3K వీక్షించారు
9 గంటల క్రితం
ఒక T.V. ఛానల్ విలేఖరి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు...... విలేఖరి: ఈ మేకలు మీవేనా...? రైతు : నల్ల మేకా.., తెల్ల మేకా...? వి : నల్ల మేక...? రైతు : నాదే... వి : తెల్ల మేక...? రైలు : అది కూడా నాదే... వి : మీ మేకలకు మీరు ఏం పెడతారు..? రై : నల్లమేకకా.., తెల్లమేకకా..? వి : నల్లమేకకు... రై : గడ్డి... వి : మరి తెల్లమేకకు...? రై : గడ్డి... వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు...? రై : నల్లమేకనా.., తెల్లమేకనా...? వి : నల్లమేకను... రై : బయటి వసారాలో...!! వి : మరి తెల్లమేకను...? రై : దాన్ని కూడా బయటి వసారాలో...!! వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు...? రై : నల్లమేకకా.., తెల్లమేకకా...? వి : నల్లమేకకు... రై : నీటితో... వి : మరి తెల్లమేకకు...? రై : దానికి కూడా నీటితో...!! వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా.., తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..? రై : ఎందుకంటే నల్లమేక నాది... వి: మరి తెల్లమేక...? . రై : అదికూడా నాదే...!! . విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు. రైతు నవ్వుతూ అన్నాడు... ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి తిప్పి ,తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా కెలా మండుతుందో..? 😳😳😳😳😳😳 #షేర్ చాట్ బజార్👍
నాగుదత్త
5.7K వీక్షించారు
1 నెలల క్రితం
ఆ పరమాత్ముడుని విశ్వసిద్దాం నిశ్చింతగా ఉందాం True hope is swift, and flies with swallow's wings. స్వాలో అనే చిన్ని పక్షులు- సంతాన వృద్ధి కోసం అర్జెంటీనాలో బయల్దేరి 8300 కి.మీ. పైచిలుకు దూరంలో ఉన్న కాలిఫోర్నియా చేరుకుంటాయి. ఇందులో వింత ఏముంది అంటారేమో .. కానీ అవి దాదాపుగా 16,600 km ప్రయాణం చేస్తాయి. అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంత సముద్రమార్గమే. అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు , ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి. అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు , ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది. అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళీ ప్రయాణం మొదలెడుతుంది.అక్కడో సురక్షిత ప్రదేశాన్ని ఎన్నుకుని గుడ్లు పెట్టి, పొదుగుతాయి. సుమారు ఏడు నెలల తర్వాత పిల్లలతో స్వస్థలం చేరుకుంటాయి. ఆ పరమాత్ముడు గుప్పెడంత (20 గ్రాములు) ఉండే పక్షుల బాగోగుల గురించే ఇంత శ్రద్ధ వహిస్తున్నాడంటే.. తన ఊపిరితో తన లాంటి స్వరూపంతో సృష్టించిన మనపై ఇంకెంత శ్రద్ధ వహిస్తాడో కదా! కానీ, ఆయన వాత్సల్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబోలు! లేకుంటే.. సుఖసౌఖ్యాలూ, భోగభాగ్యాలూ అంటు ఎందుకు వ్యాకులపడుతున్నాం ? ఆయన చేసిన మేలు ఎలా మర్చిపోతున్నాం ? ఒక చిన్న స్వాలో పక్షిని సైతం విస్మరించని సర్వోన్నతుడైన సృష్టికర్త.. మనల్ని పోషించలేడా ? ఆ సర్వేశ్వరుని విశ్వసిద్దాం, నిశ్చింతగా ఉందాం. సేకరణ: నాగు ముదిగొండ #⛳భారతీయ సంస్కృతి
See other profiles for amazing content