ఫాలో అవ్వండి
Satya Vadapalli
@13077355
12,530
పోస్ట్
21,562
ఫాలోవర్స్
Satya Vadapalli
582 వీక్షించారు
20 గంటల క్రితం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏 సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ మనస్కరమ్ నమస్కృతామ్ నమస్కరోమి భాస్వరమ్ !! సమస్త లోకములకు శుభమును కలుగచేయువానిగా, శరణాగతి కోరిన శ్రేష్ఠులగు దైత్యులను కలవాడిగా గొప్ప బొజ్జ కలవాడు, వరములను ఇచ్చువాడు, గజముఖముతో విరాజిల్లుచూ భక్తుల యందు కృపాకరునిగా, తప్పులను క్షమతో వదిలివేయువాడిగా, సంతోషమునకు నిలయమగా, కీర్తిని కలిగించి చక్కని మనస్సును ప్రసాదించున్న, ప్రకాశమానుడగు ఆ వినాయకునికి నేను నమస్కరించుచున్నాను. #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🌺 ఓం గం గణపతియే నమః ✍️🌺🙏🌹 #🌹ఓం గం గణపతయే నమః 🙏🙏 #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
Satya Vadapalli
1.1K వీక్షించారు
1 రోజుల క్రితం
🙏దీపావళి రోజున 🙏 🌸✨ దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది పవిత్ర స్థానాలు ✨🌸 లక్ష్మిదేవి — సంపద, వైభవం, ఆనందానికి మూలం. ఆమె అడుగుపెట్టిన ఇంట్లో దారిద్ర్యం చేరదు. దీపావళి రోజున లక్ష్మిదేవి భూమిని దర్శించడానికి వస్తుందని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు ఆమెకు స్వాగతం పలుకుతూ ఇంటిని శుభ్రపరిచి పూలతో, దీపాలతో అలంకరిస్తారు. అమావాస్య చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశమానమవుతుంది. 🪔 దీపావళి అంటే — చీకటిపై కాంతి విజయం. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా నివసించాలంటే, పూజ అనంతరం ఈ ఎనిమిది ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి: ① ఇంటి ప్రధాన ద్వారం వద్ద: లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఇది. పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి. ② స్టోర్ హౌస్ (ధాన్యాగారంలో): ఆహార నిల్వ చేసే ప్రదేశం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆహార సమృద్ధి కలుగుతుంది. ③ డబ్బు ఉంచే స్థలంలో: సంపద స్థిరంగా ఉండటానికి దీపావళి రాత్రి ఈ ప్రదేశంలో దీపం వెలిగించాలి. ④ వాహన సమీపంలో: దీపం వెలిగించడం వల్ల ప్రమాదాలు దూరమవుతాయి, భద్రత కలుగుతుంది. ⑤ నీటి వనరుల వద్ద (కుళాయి, బావి మొదలైనవి): జలతత్త్వం పవిత్రం. ఇక్కడ దీపం వెలిగించడం జీవన శక్తిని పెంచుతుంది. ⑥ గుడి వద్ద లేదా పూజగదిలో: దేవతామూర్తుల కృప లభిస్తుంది, దివ్య శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది. ⑦ రావి చెట్టు వద్ద: రావిచెట్టులో 33 వర్గాల దేవతలు నివసిస్తారని నమ్మకం. విష్ణువు స్వయంగా నివసించే చెట్టు ఇది. ⑧ తులసి చెట్టు వద్ద: తులసి లక్ష్మీదేవి స్వరూపం. ఇక్కడ దీపం వెలిగించడం అత్యంత మంగళప్రదం. 🌼✨ నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు? ✨🌼 దీపావళి — నరకాసురుని వధకు చిహ్నం. కానీ అతని కథలో లోతైన జీవనబోధ దాగి ఉంది. నరకాసురుడు విష్ణుమూర్తి (వరాహస్వామి) మరియు భూదేవి కుమారుడు. అతను సంధ్యవేళలో పుట్టాడు — అది జ్ఞానం (పగలు) మరియు అజ్ఞానం (రాత్రి) కలిసిన సమయం. మంచి లక్షణాలు ఉన్నా, ఒక్క చెడు లక్షణం చాలు — జీవితం నాశనం అవుతుంది. రావణుడు జ్ఞాని అయినా అహంకారంతో నశించాడు, మహిషాసురుడు బలవంతుడు అయినా మదంతో నశించాడు, అలాగే నరకాసురుడు కూడా కామం, మదం, క్రోధంతో నశించాడు. భూదేవి తన కుమారుడిని చంపకూడదని కోరినా, సత్యభామ రూపంలో తానే అతనిని సంహరించాల్సి వచ్చింది. తన సద్గుణాలు నిలుపుకోకపోతే, దేవుని పుత్రుడైనా నశిస్తాడని ఈ కథ బోధిస్తుంది. 🕊️ చెడు స్నేహం — నరకాసురుని అంతానికి మూలం. బాణాసురుడి చెడు సాంగత్యంతో నరకాసురునిలో ఉన్న రాక్షస ప్రవృత్తి మేల్కొంది. అతను మునులను అవమానించాడు, దేవతలను దూషించాడు, కామంతో రాజకుమార్తెలను చెరపట్టాడు. అంతిమంగా సత్యభామ చేతిలో తన అంతం చూసాడు. 🌺 జీవన బోధ: ప్రహ్లాదుడు రాక్షసుని కడుపున పుట్టినా దేవుడిగా మారాడు. నరకాసురుడు దేవుని కడుపున పుట్టినా రాక్షసుడయ్యాడు. ➡️ మన గుణమే మన గమ్యం. ➡️ మన సాంగత్యమే మన శాపం లేదా ఆశీర్వాదం. ➡️ దీపావళి అంటే వెలుగు మాత్రమే కాదు — అజ్ఞానం చీకటిపై జ్ఞానం వెలుగు విజయం. 🌼 లోకా సమస్తా సుఖినో భవంతు 🌼 🌕 శుభ దీపావళి! 🌕 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺 #🎉దీపావళి త్వరలో రాబోతుంది🧨 #✨దీపావళి పౌరాణిక కథలు📖 #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲
Satya Vadapalli
470 వీక్షించారు
2 రోజుల క్రితం
*శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం ఎందుకు * *ఇందులోని పరమార్థం ఏమిటి ?* కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి , ఇరుముడి కట్టుకొని , అందులో నెయ్యి నింపిన ముద్రకాయ , పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం. ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి , అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి , కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు? మాలికాపురత్తమ్మ గుడిలో కొబ్బరి కాయలు దొర్లించుటలో పరమార్తము , ఆధ్యాత్మిక భావన దాగి ఉన్నది. నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారికేళము లో స్వచ్ఛమైన భగవత్ప్రసాదిత జలము ఉండును. ఈ కాయను పగులకొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన. మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నా లోని కామ , క్రోధ , లోభ , మోహ , మధ మాత్సర్యాలను సదరు కాయలో భందించి , ఇక్కడే వదిలి పెట్టివెళుతున్నానని , చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై , పరిశుద్ధులై వెళ్లడం అనేది అంతరార్థం. నారికేళము ఈశ్వర , విష్ణు సంభంధమైనది. టెంకాయ పై నిలువు చారలు విష్ణు రూపమైతే , కొబ్బరికాయ పై ఉన్న మూడు కన్నులు శివరూపం. కొబ్బరికాయలోని "అహం" అనే నీటిని తీసి , హరి హరుల కిష్టమైన నెయ్యిని అందులో నింపి , స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో (నెయ్యి) మనకిస్తాడు. పిదప జీవత్సవమైన కాయ (కాయము , అనగా మన శరీరం) ను మంటల్లో వేసి కాలుస్తారు. శబరి యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై , పరిశుద్ద శరీరంతో , లోన దుర్గుణాలన్నియు పోగొట్టుకొని సత్సీలురై పరమ పావన రూపులై వస్తారని అర్థం. 🌼🌹🙏 హరిహరపుత్ర 🙏🌼🌹 🕉️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🕉️ 🍏🌼🍍🌹🍈🌿🥥🥥🌿🌷🍋🍁🌻 #🌹🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏 🌷🌹🌼 #స్వామి అయ్యప్ప #🙏🏻 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🏻 #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲
See other profiles for amazing content