ఫాలో అవ్వండి
P. Chandra Shekar
@85849297
25,113
పోస్ట్
37,918
ఫాలోవర్స్
P. Chandra Shekar
571 వీక్షించారు
మన భారతదేశం / ఇక్కడి ధార్మికులు గొప్పవారు. #భారతదేశం గాయంతి దేవాః కిల గీతకాని ధన్యాస్తు తే భారతభూమిభాగే | స్వర్గాపవర్గాస్పదమార్గభూతే భవంతి భూయః పురుషాః సురత్వాత్ || #విష్ణుపురాణం స్వర్గానికి, మోక్షానికి మార్గమైన ఈ భారత భూమిలో జన్మించిన మనుషులు దేవతల కంటే ధన్యులని స్వయంగా ఆ దేవతలే కీర్తిస్తారు. #మాతృభూమి_గొప్పతనం. శ్రీరాముడు లంకను జయించిన తర్వాత లక్ష్మణుడితో అన్న మాట ఇది. స్వర్గం కంటే మాతృభూమి గొప్పదని, అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే | జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ || #రామాయణం లక్ష్మణా! ఈ లంక బంగారంతో నిర్మితమైనా నాకు దీనిపై మోజు లేదు. ఎందుకంటే కన్నతల్లి మరియు జన్మభూమి స్వర్గం కంటే కూడా మిన్న (గొప్పవి). #శ్రీమద్భాగవతం అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః | యైర్జన్మ లబ్ధం నృషు భారత అజిరే ముకుందసేవౌపయికం స్పృహా హి నః || "ఆహా! ఈ భారతదేశంలో పుట్టిన వారు ఎంతటి పుణ్యం చేశారో కదా! వారిపై సాక్షాత్తు శ్రీహరి ప్రసన్నుడై ఉన్నాడు. ముకుందుని (కృష్ణుడిని) సేవించుకోవడానికి అనువైన ఈ భారత భూమిలో జన్మించిన వారిని చూస్తుంటే మాకు (దేవతలకు సైతం) అసూయ కలుగుతోంది. మాకు కూడా అక్కడ పుట్టాలని కోరికగా ఉంది." #కర్మభూమి. అత్రైవ నరకః స్వర్గో జీవన్ముక్తిశ్చ కేవలా | అన్యత్ర భోగభూమిస్తు కర్మభూమిరియం తతః || "ఇక్కడ మాత్రమే మనిషి తన కర్మల ద్వారా నరకాన్ని, స్వర్గాన్ని లేదా జీవన్ముక్తిని (మోక్షాన్ని) పొందగలడు. మిగిలిన భూములు కేవలం అనుభవానికి (భోగానికి) సంబంధించినవి, కానీ ఇది మాత్రమే సాధనకు అనువైన కర్మభూమి." #మాతృదేశం_ధర్మము. ఉత్తమం దేశభక్తిశ్చ ధర్మభక్తిస్తథైవ చ | దేశో ధర్మస్య మూలం హి రక్షేత్ దేశం ప్రయత్నతః || దేశభక్తి మరియు ధర్మభక్తి రెండూ ఉత్తమమైనవే. కానీ దేశమే ధర్మానికి మూలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా ముందు దేశాన్ని రక్షించాలి. దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది. సేకరణ: #🇮🇳26th జనవరి హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
P. Chandra Shekar
1K వీక్షించారు
మన మొదటి రిపబ్లిక్ డే ఇలా జరిగింది..! భారతదేశం 1950 జనవరి 26న 'సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర' రాజ్యంగా అవతరించింది. ఆ రోజు ఉదయం 10:18 గంటలకు దర్బార్ హాల్ (రాష్ట్రపతి భవన్) నుంచి అధికారిక ప్రకటన రాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. పరేడ్ రాజ్పథా కాకుండా ఇర్విన్ యాంఫీ థియేటర్ (నేషనల్ స్టేడియం)లో జరిగింది. ఎటువంటి సెక్యూరిటీ హడావిడి లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ బగ్గీలో వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. #🇮🇳26th జనవరి హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
See other profiles for amazing content