తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మన్ కుమారులు మరియదాసు,భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు, పిన్నెల్లి గ్రామస్తులు
ఇటీవల టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన మందా సాల్మన్
తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని వైయస్ జగన్‌కు వివరించిన సాల్మన్ కుమారులు, కుమార్తె, తమ తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసిన కుమారులు, కుమార్తె. పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించింది, అక్రమ కేసులు పెట్టి వేధించిన తీరును వైయస్ జగన్‌కు వివరించిన సాల్మన్ కుటుంబ సభ్యులు, పిన్నెల్లి గ్రామస్తులు
వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైయస్ జగన్, అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయసహాయం అందిస్తుందని వెల్లడి, ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్ జగన్
ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు.
#🆕షేర్‌చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్