ఫాలో అవ్వండి
Kappati Panduranga Reddy
@kappati152
6,390
పోస్ట్
12,143
ఫాలోవర్స్
Kappati Panduranga Reddy
531 వీక్షించారు
21 గంటల క్రితం
*🌤️శుభ శుభోదయం🙏* కుటుంబం కోసం కోట్లు సంపాదించి చనిపోయిన తర్వాత కట్టెని ఇంటి ముందు కొన్ని క్షణాలే ఉంచుతారు. కానీ సమాజం కోసం ఏదైనా మంచి పని చేస్తే అందరి గుండెల్లో పదిలంగా ఉంచుతారు. ప్రాధేయపడితే వచ్చే ప్రేమలు ప్రాకులాడితే వచ్చే బంధాలు బెదిరిస్తే కొనసాగే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. శరీరం కుంటిదైన గుడ్డిదైనా పెద్ద సమస్యలు కావు ఆలోచనలు గుడిచేటివి అయితేనే అసలు సమస్యలు. జీవితమనేది సుఖదుఃఖాల ప్రవాహం. పరమ సుఖమనే సముద్రమే దాని గమ్యం. అందుకే ఒక తులం బంగారం లభించడం కన్నా ఒక గ్రాము అదృష్టం దొరకటం చాలా మిన్న. తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి #🌅శుభోదయం
Kappati Panduranga Reddy
637 వీక్షించారు
11 రోజుల క్రితం
*బతుకమ్మ పండగ ప్రారంభం సందర్భంగా అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐* ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బతుకమ్మ అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు ? ముమ్మాటికీ *తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారే !* తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిండ్రు ! తెలంగాణ ఓ చారిత్రక నేపద్యాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుందాం.. ! శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా లోని కోటిలింగాల బదులుగా గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంగా విధ్యార్థులు పుస్తకాల్లో చదివే వాళ్ళు ! పోతన ఎక్కడి వాడంటే వరంగల్ ప్రాంతం కాదు కడప ప్రాంతం అని చెప్పబడేది ! ప్రపంచం లో 150 కోటలతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణ పదమే నిషిద్దం అయ్యింది ! తెలుగు సాహిత్యం లో జినవల్లభుడు రాసిన తొలి కంద పద్యం వెలసిన బొమ్మలమ్మ గుట్ట ఊసే లేకుండా పోయింది ! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినంత బలంగా రామగుండం ఎరువు తెలంగాణ పరువు అనే నినాదం అక్షర రూపం దాల్చలేకపోయింది ! రెండు జిల్లాల్లో జరుపుకొనే అట్లతద్దె గురించి అచ్చు వేసిండ్రు కాని ప్రపంచం లోనే మహిళలు అతి పెద్దగా జరుపుకొనే బతుకమ్మ గురించి పట్టించుకోలేదు ! అగో సరిగ్గ ఆ బతుకమ్మ అంశాన్నే ఆలంబనగా చేసుకున్న నాయకురాలు కవితమ్మ గారు బయలుదేరింది ! బతుకమ్మకు ప్రాచూర్యాన్ని కలిపించాలని సకల్పించింది ! అందరి సంస్కృతి ఎలుగెత్తబడ్డప్పుడు తన సంస్కృతి ఎందుకు విశ్వ వ్యాప్తం కాకూడదు అనుకొంది ! కొద్ది మంది మహిళలను పోగు చేసి బతుకమ్మ ఆడింది ! పది , ఇరవై , వంద అలా అలా వేలాది మహిళలు ఒక్క చోట చేరిన పూల జాతరను ప్రపంచం వీక్షించింది ! కాదు అలా వీక్షించేలా చేసింది ! తన ప్రాంతం సాంస్కృతికోద్యమ సారధిగా ముందు నడచింది ! అనుకూలం , వ్యతిరేఖం ఏది అయితేనేమి అందరి నోట బతుకమ్మ అనిపింపించింది ! ఇక బతుకమ్మను అచ్చువేయక పేపర్లకు తప్పేది కాదు ! తొమ్మిది రోజుల పాటు టివిలు చర్చకు పెట్టే అనివార్య పరిస్థితులు కల్పించబడ్డాయి ! ఎవరెన్ని విమర్శలు చేసినా తన కృషి మూలంగా బతుకమ్మ పాఠ్య పుస్తకం లో ఓ పాఠ్యాంశం అయ్యింది ! మరుగున పడ్డ కళలు సాంకృతిక అంశాలు అక్షర రూపం దాల్చాయి ! ఎట్టకేలకు కోట్లాది గిరిజనుల పండుగ అయిన సమ్మక్క సారక్క చరిత్ర పుస్తకం లో అచ్చయ్యింది ! బౌద్దం అంటే అమరావతి అనుకొనే పరిస్థితి నుండి వెయ్యేండ్ల చరిత్ర గలిగిన దూళికట్ట వెలుగులోకి వచ్చింది ! తెలుగుకు ప్రాచీన హోదాకు కావలసిన ఆధారాల కొరకు ఆంధ్రాలో వెతికే ఆర్కియాలజీ శాఖ తెలంగాణ గడ్డను తవ్వింది ! మన గడ్డలోనే అసలైన మూలాలు ఉన్నయని కేంద్రమూ అంగీకరించింది ! తన కార్యదక్షత తో తెలంగాణ చారిత్రక , సాంకృతికాంశాల కు ప్రత్యక్షంగా , పరోక్షంగా పునరుజ్జీవం పోసిండ్రు కవితమ్మ గారు! తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి #బతుకమ్మ శుభాకాంక్షలు
Kappati Panduranga Reddy
630 వీక్షించారు
12 రోజుల క్రితం
*పెద్దల అమావాస్య.....* *మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ అమావాస్య" అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది.* *భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక "పితృపక్షం" అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ* *పక్షంలోను. మహాలయ అమావాస్యనాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది.* *పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది.* *కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు.* *మహాలయ పక్షం "దినేదినే గయాతుల్యం" అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి.* *మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది.* *┈┉┅━❀꧁పిత్రుదేవా꧂❀━┅┉┈* 🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
Kappati Panduranga Reddy
657 వీక్షించారు
12 రోజుల క్రితం
మహలయా అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది.* ➖➖➖✍️ మీ గోత్రం... మీ పేరు చెప్పుకొని... నా జన్మకు మూల కారణమైన నా తల్లి -దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు. ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి, నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి. ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి. నాలోనూ, నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య ముల నొసగి, ధర్మార్ద, కామ, మోక్ష ముల నొసగి, అహం పదార్ద రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ.. అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా .. ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను.🙏``` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) *
Kappati Panduranga Reddy
695 వీక్షించారు
14 రోజుల క్రితం
*🌤️శుభ శుభోదయం🙏* *📖పుస్తకం* తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం బలం ఏమిటో. ఒక మంచి పుస్తకం ఎలా అర్థంకాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థంకాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే. నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. తమ విశ్వసనీయ కప్పాటి పాండురంగా రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #శుభో దయం🌄 #🌅శుభోదయం
Kappati Panduranga Reddy
1.4K వీక్షించారు
15 రోజుల క్రితం
నిరంకుశ రాచరిక పాలన,దొరల దాష్టీకం అంతమైన సందర్భం భారతావనిలో విలీనంతో మొదలైన ప్రజాస్వామిక ప్రస్థానం తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలనకు అడుగులు పడిన రోజు సెప్టెంబరు 17..ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటూ.. ప్రజాపాలనలో జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు💐... తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగా రెడ్డి*_ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 #తెలంగాణ #ప్రజాపాలన #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
Kappati Panduranga Reddy
638 వీక్షించారు
15 రోజుల క్రితం
విశ్వాన్ని మలచిన సృష్టికర్తగా భగవానుడు విశ్వకర్మను పూజిస్తాం. సకల కళలకు, సృజనాత్మకతకు అధినేత, మానవ మనుగడకు అవసరమైన రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భారతీయ సంస్కృతిలో ప్రాచీన యంత్ర, వాస్తుశాస్త్ర నిపుణుడు, దేవశిల్పి, స్వర్గలోకాన్ని, ద్వారకా నగరాన్ని, పాండవుల మయసభను ఇలా మరెన్నో అద్భుత కట్టడాలను నిర్మించిన సృజనాత్మక నిర్మాణానికి ప్రతీక, శిల్పకళా ప్రసిద్ధుడు, దేవశిల్పి తినే కంచం నుండి పడుకొనే మంచం వరకూ అన్ని సృష్టించిన మహా శిల్పి ప్రపంచం లో ప్రముఖ హిందూ దేవతలు దేవాలయాలు శిల్పాలు ఆన్ని విశ్వకర్మ సృష్ఠియే.. దేవశిల్పి *"భగవాన్ విశ్వకర్మ"* జయంతి శుభాకాంక్షలు🙏.. తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగా రెడ్డి*_ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 #🙏విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు🎉
See other profiles for amazing content