తెలంగాణజాగృతి
17 Posts • 13K views
Kappati Panduranga Reddy
558 views 1 days ago
*🌤️శుభ శుభోదయం🙏* కుటుంబం కోసం కోట్లు సంపాదించి చనిపోయిన తర్వాత కట్టెని ఇంటి ముందు కొన్ని క్షణాలే ఉంచుతారు. కానీ సమాజం కోసం ఏదైనా మంచి పని చేస్తే అందరి గుండెల్లో పదిలంగా ఉంచుతారు. ప్రాధేయపడితే వచ్చే ప్రేమలు ప్రాకులాడితే వచ్చే బంధాలు బెదిరిస్తే కొనసాగే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. శరీరం కుంటిదైన గుడ్డిదైనా పెద్ద సమస్యలు కావు ఆలోచనలు గుడిచేటివి అయితేనే అసలు సమస్యలు. జీవితమనేది సుఖదుఃఖాల ప్రవాహం. పరమ సుఖమనే సముద్రమే దాని గమ్యం. అందుకే ఒక తులం బంగారం లభించడం కన్నా ఒక గ్రాము అదృష్టం దొరకటం చాలా మిన్న. తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి #🌅శుభోదయం
9 likes
15 shares
Kappati Panduranga Reddy
655 views 12 days ago
*బతుకమ్మ పండగ ప్రారంభం సందర్భంగా అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐* ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బతుకమ్మ అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు ? ముమ్మాటికీ *తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారే !* తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిండ్రు ! తెలంగాణ ఓ చారిత్రక నేపద్యాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుందాం.. ! శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా లోని కోటిలింగాల బదులుగా గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంగా విధ్యార్థులు పుస్తకాల్లో చదివే వాళ్ళు ! పోతన ఎక్కడి వాడంటే వరంగల్ ప్రాంతం కాదు కడప ప్రాంతం అని చెప్పబడేది ! ప్రపంచం లో 150 కోటలతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణ పదమే నిషిద్దం అయ్యింది ! తెలుగు సాహిత్యం లో జినవల్లభుడు రాసిన తొలి కంద పద్యం వెలసిన బొమ్మలమ్మ గుట్ట ఊసే లేకుండా పోయింది ! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినంత బలంగా రామగుండం ఎరువు తెలంగాణ పరువు అనే నినాదం అక్షర రూపం దాల్చలేకపోయింది ! రెండు జిల్లాల్లో జరుపుకొనే అట్లతద్దె గురించి అచ్చు వేసిండ్రు కాని ప్రపంచం లోనే మహిళలు అతి పెద్దగా జరుపుకొనే బతుకమ్మ గురించి పట్టించుకోలేదు ! అగో సరిగ్గ ఆ బతుకమ్మ అంశాన్నే ఆలంబనగా చేసుకున్న నాయకురాలు కవితమ్మ గారు బయలుదేరింది ! బతుకమ్మకు ప్రాచూర్యాన్ని కలిపించాలని సకల్పించింది ! అందరి సంస్కృతి ఎలుగెత్తబడ్డప్పుడు తన సంస్కృతి ఎందుకు విశ్వ వ్యాప్తం కాకూడదు అనుకొంది ! కొద్ది మంది మహిళలను పోగు చేసి బతుకమ్మ ఆడింది ! పది , ఇరవై , వంద అలా అలా వేలాది మహిళలు ఒక్క చోట చేరిన పూల జాతరను ప్రపంచం వీక్షించింది ! కాదు అలా వీక్షించేలా చేసింది ! తన ప్రాంతం సాంస్కృతికోద్యమ సారధిగా ముందు నడచింది ! అనుకూలం , వ్యతిరేఖం ఏది అయితేనేమి అందరి నోట బతుకమ్మ అనిపింపించింది ! ఇక బతుకమ్మను అచ్చువేయక పేపర్లకు తప్పేది కాదు ! తొమ్మిది రోజుల పాటు టివిలు చర్చకు పెట్టే అనివార్య పరిస్థితులు కల్పించబడ్డాయి ! ఎవరెన్ని విమర్శలు చేసినా తన కృషి మూలంగా బతుకమ్మ పాఠ్య పుస్తకం లో ఓ పాఠ్యాంశం అయ్యింది ! మరుగున పడ్డ కళలు సాంకృతిక అంశాలు అక్షర రూపం దాల్చాయి ! ఎట్టకేలకు కోట్లాది గిరిజనుల పండుగ అయిన సమ్మక్క సారక్క చరిత్ర పుస్తకం లో అచ్చయ్యింది ! బౌద్దం అంటే అమరావతి అనుకొనే పరిస్థితి నుండి వెయ్యేండ్ల చరిత్ర గలిగిన దూళికట్ట వెలుగులోకి వచ్చింది ! తెలుగుకు ప్రాచీన హోదాకు కావలసిన ఆధారాల కొరకు ఆంధ్రాలో వెతికే ఆర్కియాలజీ శాఖ తెలంగాణ గడ్డను తవ్వింది ! మన గడ్డలోనే అసలైన మూలాలు ఉన్నయని కేంద్రమూ అంగీకరించింది ! తన కార్యదక్షత తో తెలంగాణ చారిత్రక , సాంకృతికాంశాల కు ప్రత్యక్షంగా , పరోక్షంగా పునరుజ్జీవం పోసిండ్రు కవితమ్మ గారు! తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి #బతుకమ్మ శుభాకాంక్షలు
9 likes
15 shares