ఫాలో అవ్వండి
maa Putta
@putta777
9,304
పోస్ట్
19,531
ఫాలోవర్స్
maa Putta
524 వీక్షించారు
16 గంటల క్రితం
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 2🌷🌷* *"ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను " (ఎఫెసీ. 4:13)* దేవుడు తన ప్రణాళిక చొప్పున విశ్వాసుల యొక్క ఆత్మీయ పరిపక్వత నిమిత్తమై సంఘమునకు ఐదంతల వరములనిచ్చెను (ఎఫెసీ. 4: 11-16), పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు ఉపదేశకులను ఇచ్చెను. ఆ రీతిగా విశ్వాసులు పరిపక్వతకు తీసికొని రాబడగలరు. విశ్వాసుల ఎదుగుదల నిమిత్తము ఈ వరములన్నియు పనిచేయుట అవసరమై యున్నది. అపొస్తలులు సువార్త ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వరములన్నియు బయలు పరచబడుటను అపొ. కా. 14:21-23; 15:32; 20: 28-36 లలో చూచుదుము. మొట్టమొదటిగా అపొస్తలుడు, మరియు అతని జతపని వారి ద్వారా సువార్త అధికారంతో ప్రకటించబడెను. మరియు వారు వారిని కట్టి, విశ్వాసమందు స్థిరపరచుటకు కొంతకాలము వరకు వారితో ఉండ గలిగిరి. కావున విశ్వాసులు కాపరత్వము పొంది, పరిపక్వతకు తీసికొని రాబడిరి. తరువాత ప్రతి స్థలములో పెద్దలను నియమించిరి. "మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలని ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి" ( అపొ. కా. . 14:23). కావున వారు ఎంతో ప్రార్ధించి, ప్రభువు యొద్ద వేచియుండిన పిమ్మట పెద్దలుగా ఉండుటకు ఎవరు తగినవారని కనుగొన గలిగిరి. 1 పేతురు 5 వ అధ్యాయము ద్వారా పెద్దలు ఏలాగున పనిచేయవలెనో చూచుదుము. మొట్టమొదటిగా పెద్దలుగా ఏర్పరచబడినవారు ఎంతో దీనులై యుండవలెను. "తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచ బడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించు చున్నాను” ( 1 పేతురు 5:1) అపొస్తలుడైన పేతురు, తాను ఒక పెద్దనని వారితో చెప్పుచున్నాడు. ఆలాగున అతడు ఎంతో దీన స్థానమును తీసికొనుచున్నాడు . ఒక వ్యక్తి నిజముగా దీనుడుగా ఉంటేనే తప్ప, అతడు తన మందను పోషించలేడు. తమను బట్టి తాము గర్వించు వారు, స్వయం మహిమను వెదకువారు పెద్దలుగా పనిచేయలేరు. రెండవదిగా, పేతురు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చిన సాక్షినని చెప్పుచున్నాడు (1 వ.వ) ఒక వ్యక్తి పెద్దగా ఉండవలెనని కోరుచున్న యెడల అతడు సువార్త నిమిత్తము కొంత శ్రమ, కష్టము, హింస ద్వారా వెళ్ళవలెను. ఏ కాపరులైతే శ్రమల ద్వారా వెళ్ళు దురో వారు రాబోవు శ్రమలను భరించు గలుగుదురు.. మూడవదిగా, పేతురు తనను గురించి బయలు పరచ బడబోవు మహిమలో పాలివాడనని చెప్పుకొనుచున్నాడు (1 వ.వ) పేతురుకు ప్రభువు యొక్క రెండవ రాకడ యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలదు. ప్రభువైన ఏసుక్రీస్తును మన రక్షకుని గా అంగీకరించి నప్పుడు, మనము ఏడు అంతల ఆత్మీయ పాలి భాగత్వము లోనికి ప్రవేశించుదుము. కావున తమ పరలోక పిలుపు, పరిచర్య యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలవారే పెద్దలు. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
maa Putta
467 వీక్షించారు
1 రోజుల క్రితం
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 1🌷🌷* *" నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను" ( కీర్తన 40:2)* సంఘము లేక ఎక్లీసియా, అనగా 'బయటకి లాగుబడుట' యని అర్థము. ఒకవేళ బంగారము. వెండి, ఇనుము, ఇత్తడి, ప్రశస్తమైన వజ్రములు, ముత్యములతో చేయబడిన వివిధ రకములైన వస్తువులు గల పెద్ద కుప్ప సమీపమున ఒక అయస్కాంతమును ఉంచిరనుకొనుము. కేవలము తుప్పుబట్టిన, మురికి మేకు మాత్రమే అయస్కాంతము ద్వారా బయటకు లాగబడును గాని ప్రియమైన, విలువైన వస్తువులు విడచి పెట్టబడును. అదే రీతిగా క్రీస్తు దరిద్రులు, తప్పిపోయిన, పశ్చాత్తాప పడిన, అపవిత్రులైన పాపులనే ఆకర్షించును గాని, లోకములో అహంకారులు, సంపన్నులైన వారు ఏ మాత్రము ఆయన యొద్దకు రాలేరు (లాగబడరు). ఎక్లీసియా అనగా “బయటికి లాగబడుట”. ఇది క్రీస్తు ద్వారా లోకములో నుండి బయటికి లాగబడిన వారిని గురించి మాట్లాడుచున్నది. వారు పామరులైనను, లోకములో అత్యున్నతమైన ఏ అర్హత లేని వారైనను వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారగుదురు. అట్టి ప్రజలను గురించి మన ప్రభువు, “నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని” (యోహాను 15: 19) అని చెప్పుచున్నాడు. ఈ లాంటి సంఘమునకు నీవు చెందియున్నావా? యేసు ప్రభువు లోకము నుండి నిన్ను బయటికి లాగెనని నిజముగా చెప్పగలవా? *నీవు క్రైస్తవ పేరుకలిగి యున్నందున లేక చాల బైబిలు జ్ఞానము కలిగి యున్నందున ప్రభువునకు చెందియున్నానని తలంచకుము*. నీ హృదయములో, నీ జీవితములో మార్పు ఉండవలెను. నీవు దేవుని బలమైన హస్తముచే బయటికి లాగబడినప్పుడు, లోక సుఖములు నిన్ను ఆకర్షించ లేవు (అవి వాటి ఆకర్షణ శక్తిని నీ యెడల పోగొట్టుకొనును). క్రీస్తు నీ హృదయములోనికి వచ్చెను, చీకటి మాయమయ్యెను. నీవు పాపము యొక్క బలము నుండి విడిపించ బడితివి గనుక నీవు ఏ మాత్రము పెనుగులాడి, పోరాడనవసరము లేదు. ఈ కార్యము నీలో జరిగితేనే తప్ప, నీవు సంఘమునకు చెంది యున్నానని చెప్పలేవు. అనేక మంది నామకార్ద క్రైస్తవులు లోక సంబంధమైన విషయముల కొరకు ఆశకలిగి యుందురు. వారు అప్పుడప్పుడు లోక సుఖములయందు నిమగ్నులై యున్న యెడల ఏ మాత్రము హాని యుండదని తలంచుదురు. వారు సినిమాకు, సంవత్సరమునకు రెండు లేక మూడు సార్లు, “మంచి సినిమాలకు” మాత్రమే వెళ్ళుటకు ఇష్టపడుదురు. సీసా నిండా విషము లేక దానిలో ఒక చుక్క విషమైనను మరణకరమైనదని వారు గ్రహించలేరు. చిన్న టి.బి. క్రిములు నీ శరీరమంతటిని చంపగలవు. కంటిలోని ఒక మచ్చ గ్రుడ్డితనమును తీసికొని రాగలదు. ప్రభువు నిన్ను ప్రతివిధమైన లోక సంబంధమైన సుఖము నుండి విడిపించి తన నిజసంఘములో సభ్యునిగా చేసెనని నిశ్చయ పరచుకొనును. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
maa Putta
560 వీక్షించారు
2 రోజుల క్రితం
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷సెప్టెంబరు 30🌷🌷* *"ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించు చున్నాడు గనుక .. శక్తిమంతుడై* *యున్నాడు" (హెబ్రీ 7:25)* మన పరలోక ప్రధాన యాజకుడుగా, యేసుక్రీస్తుకు నాలుగంతల పరిచర్య కలదు. మొదటిగా, ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయును. రెండవది, మన పక్షముగా పరిపూర్ణమైన బలి గావించెను. మూడవది, దేవుని చిత్తమును తెలిసికొనుటకు ఆయన సహాయము చేయును. నాల్గవది, మన గొప్ప ప్రధాన యాజకుడుగా యేసు క్రీస్తు మనకు పరలోక ఆహారము నిచ్చును. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడుగా అబ్రాహామునకు కనబడినట్లు ఆదికాం. 14: 18 లో చూచుచున్నాము. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసికొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతడు ఎక్కడ నుండి వచ్చెనో ఎవరికీ తెలియదు. అతడు తండ్రి, తల్లి లేనివాడు. అతడు ఆది, అంతము లేనివాడు. అతడు, దేవుని కుమారునివలె ఉన్నాడు. అనగా దేవుడే మెల్కీసెదెకు రూపమును దాల్చి పరలోక ఆహారమును అబ్రాహామునకు తెచ్చి ఇచ్చినట్లుగా రుజువు చేయబడుచున్నది. ఇది యేసుక్రీస్తు శరీరమునకు, రక్తమునకు సాదృశ్యమైన ప్రవచనము. అబ్రాహాము పరలోకపు ఆహారమును తినుట ద్వారా అధికమైన శక్తిని పొంది, సొదొమ రాజు ద్వారా వచ్చిన శోధనను జయించగలిగెను. మనము ఆత్మీయ శక్తిని పొందుటకు పరలోకపు ఆహారము అవసరమై యున్నది. మన బాల్యములో, యౌవ్వనకాలములో మరియు వృద్దాప్యములో ఎదుర్కొను ప్రతి శోధనను జయించుటకు ఏర్పాటుచేసెను. "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును" (1 కొరింతి. 10:13). మెల్కీసెదెకు యొక్క చేతినుండి పరలోకపు ఆహారమును పొందుట ద్వారా ఆ విజయము సాధ్యమయ్యెను. శోధన సమయములో మన బైబిలు జ్ఞానము మరియు స్వశక్తి మనకు సహాయము చేయలేవు. యేసుక్రీస్తు ప్రభువే కనికరముగల, నమ్మకమైన మన ప్రధాన యాజకుడు. హెబ్రీ 2:17,18 ల ప్రకారము విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళినపుడు ఆయన పరిచర్య ద్వారా ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమము చొప్పున శక్తిని పొందుదుము. ఆయన శత్రువు యొక్క కుతంత్రములన్నిటిపై విజయము నిచ్చును. *ఎవరైతే తమపై తాము లేక తమ బైబిలు జ్ఞానముపై, దీర్ఘకాలపు ఉపవాస ప్రార్ధనలపై ఆధారపడుదురో వారు ఆత్మీయముగా ఓడిపోయి గొడ్డుబారిన వారుగా నుండెదరు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రధాన యాజకత్వము ద్వారా మేలు పొందగోరుదురో వారు ఆత్మీయముగా దినదినము బలపడుదురు*. మొదటిగా, యేసుక్రీస్తును మన రక్షకునిగా యెరుగుదుము. తరువాత మన ప్రభువుగా, రాజుగా తెలిసికొందుము. తరువాత ఆయనను ప్రధాన యాజకునిగా తెలిసికొందుము. మన అనుదిన జీవితములో ఆయన ప్రధాన యాజకత్వపు పరిచర్యను ఏ విధముగా ఉపయోగించుకొనవలెనో ప్రభువే మనకు బోధించును గాక! Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
See other profiles for amazing content