#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శనివారం భక్తి స్పెషల్ 💐
ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల దర్శనము 2
కొందరు చదువుతారు సహస్ర నామములు, అందరు ముచ్చటించుచుండ!
ఆకలిని గమనించిన స్వామి పంపుతాడు వేడి వేడి కదంబం!
ఆవురావురమని ఒకటికి నాలుగు దొన్నెల ప్రసాదం తీసికొని తింటారు!
రెండు మూడు తీసుకొన్న వాళ్ళు తిన్నా ఫరవాలేదు, ఎక్కువ చేసి పడేస్తారు!
సరే పిల్లలని క్షమిస్తాడో స్వామి, బుద్ధి చెప్తాడో తెలియదు మనకు!
పక్క కంపార్టమెంట్ తెరిచిన చప్పుడు విని, లేచి, పట్టుకొని పోయిన కాళ్లను విదిల్చి, మన దర్శనము కొరకు సన్నద్ధులౌతాము, ఎప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తూ!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస శుక్ల పక్ష తిథి చవితి.