క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా, నార్త్ జోన్ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేసి, 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. తమకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. వీరి వద్దనుండి 8,40,000 నగదు, 8 చరవాణిలు, క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ఉపయోగించే టీవీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్ కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడుగా గుర్తించిన విశాఖపట్నం కి చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని, త్వరలో ప్రధాన నిందితుడు రాకేష్ ను పట్టుకుంటామని తెలిపారు. బెట్టింగ్ కు పాల్పడిన
గోసంశెట్టి వీరప్రసాద్, జాజుల బాలచక్రం, నల్లల లక్ష్మీ నరసయ్య, కొడతాల నానాజీలను రిమాండ్ కు తరలించనున్నట్లు డిఎస్పి తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన స్థానిక కోరుకొండ, సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు మార్గాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఆన్లైన్ బెట్టింగ్ ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని, అటువంటి ఆన్లైన్ బెట్టింగ్ లు, జూద క్రీడలకు మధ్యతరగతి ప్రజల దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #🗞ప్రభుత్వ సమాచారం📻