ShareChat
click to see wallet page
సాయి విభుతి వైభవం పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం అంటూ శ్రీ సాయినాధుని ఉదీని స్మరించుకుని సేవిస్తే ఎన్నొ మహత్యములు కలుగుతాయి. సమర్ధ సద్గురువైన శ్రీ సాయినాదుని దివ్య ఉది చేసే మహిమలు పుంఖాను పుంఖాలుగా సాయి సచ్చరిత్రలో వివరించబడ్దాయి.మరణించిన వారిని సైతం బ్రతికించిన అపూర్వమైన కధనాలు కూడా సచ్చరిత్రలో వివరించబడ్దాయి. భక్తులు ఎదుర్కొనే కష్ట నష్టములు, దుఖములు,అపాయములు,నివారణా సాధ్యం కాని రోగముల్లెంటినో బాబా గారి ఉదీ నయం చేసింది. బాబా యొక్క ఉదీ సంజీవని ఔషధం కంటే మిన్నగా పనిజేస్తుంది. అంతే కాక సృష్టిలో మనకు కనిపించే వస్తువులన్నియూ అనిత్యములని,ఈ శరీరం మరణించిన పిమ్మట కాలి బూడిద అగుననియు, ఒక్క ఆ భగవంతుడు మాత్రమే నిత్యమన్న సత్యం బాబా యొక్క ఊదీ మనకు తెలియజేస్తోంది. ఈ విధంగా బాబా ఊదీ భౌతిగంగానే కాక అధ్యాత్మికంగా కూడా మనపై పనిజేస్తుంది.బాబా ఉదీని సేవించేటప్పుడు మనస్పూర్తిగా బాబాను ప్రార్ధించి కొంత నుదిటిపైనా, మరికొంత మంచి నీటీలో కలిపి సేవిస్తే ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనం కలుగదు.సాయి భక్తులకు బాబా యొక్క ఉదీ ఒక వరప్రసాదం. నేటికీ లక్షలాది మంది సాయి భక్తులు అచంచలమైన భక్తితో సాయి యొక్క ఉదీని సేవించి చక్కని ఫలితాలను పొందుతున్నారు. సాయి భక్తులకు సాయి ఊదీ మృత సంజీవని,సాయి పాదాలే శరణ్యం, సాయి నామమే వేద మంత్రాలు.సాయి సచ్చరిత్ర పారాయణమే సర్వ పాపాలకు నిష్కృతి. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat

More like this