ShareChat
click to see wallet page
🌷🌷🌷దైవ మర్మములు - Bro. Bakht Singh🌷🌷🌷 🛐 Daily Devotional 🛐 Theme of the Month: దైవ మర్మములు Saturday, January 3 *''నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు'' (కీర్తన 16:11).* మనము దేవుని సన్నిధిలో జీవించు కొలది మన సంతోషము విస్తరిల్లు చుండును. సంపూర్ణ సంతోషము లభించు స్థలమిదే. తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి యున్నవని సాక్ష్యమియ్య గల అనేకులు గలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రము వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభువుతో లేశమాత్రమైనను సంబంధము లేక ఉండవచ్చును. ప్రార్థన కూటములో కూర్చుండవచ్చును. అయినను ప్రభువు సాన్నిద్యమును ఎరుగకుండవచ్చును. ఆయన సహవాసమందు ఉండునది, లేనిది కూడా తెలియక ఉండవచ్చును. ఆయన సన్నిధి గుర్తింపు నీకులేని యెడల నీకు సంపూర్ణ సంతోషము లేదు. దీనికి అనేక కారణములుండవచ్చును. నీ స్వంత తప్పు కూడా అయివుండవచ్చును. దేవుని బిడ్డగా ఆయన యెదుట నీ హృదయము పవిత్రము గాను, నీ మనస్సాక్షి సరియైనదిగాను ఉండినయెడల ఆయన సన్నిధిని గ్రహించి తెలిసికొని, తప్పక అనుభవించగలుగుదువు. ప్రేమగల, సజీవుడైన దేవుడు తన సన్నిధి యందు జీవించు రహస్యమేమిటో తన ప్రజలు తెలిసికొన వలెనని ఉద్దేశించి యున్నాడు గనుక, నీవది తెలిసికొన వలెనను నదియే మా ప్రార్థన. Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com

More like this