అలసినవానిని ఊరడించు మాటలు
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
DAILY MEDITATIONS FROM THE MINISTRY OF Bro. BAKTH SINGH
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
🌷🌷🌷 Saturday, January 3 🌷🌷🌷
*''అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి.... గురి యొద్దకే పరుగెత్తుచున్నాను'' (ఫిలిప్పీ 3:13,14).*
''మనష్షే'' అనగా మరచుట అని అర్థము. ''అప్పుడు యోసేపు- దేవుడు నా సమస్త బాధను నా తండ్రి యింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని'' చెప్పెను (ఆదికాండము 41:51). యోసేపు గతమును మరచిపోయినట్లు మనము కూడా మరచి, కొంత శ్రేష్ఠమైన భవిష్యత్తు కొరకు ఎదురుచూడవలసియున్నది (ఫిలిప్పీ 3:13). మనము మనుష్యుల దయను పొందుటకు గత శ్రమలను గురించి మాటలడుట యందు సంతోషించుదుము. ఏదేమైనను ఆత్మీయముగా ఎదుగుటకుగాను గతములోని ప్రతి విధమైన శ్రమను సంపూర్ణముగా మనము మరచిపోవలెను.
కొన్నిసార్లు మనము గతము వైపు చూచి, అనేక సంవత్సరముల క్రిందట ప్రభువు మన యెడల ఏమైతే చేసెనో జ్ఞాపకము చేసికొని సంతోషించెదము. మనము పది, పండ్రెండు లేక పదిహేను సంవత్సరముల క్రిందట జరిగిన దానిని ఎడతెగక ఇతరులకు చెప్పుచునే యుందుము. కొన్నిసార్లు ఆ అద్భుత దినములను గురించి కన్నీటితో చెప్పుదుము మరియు కొంత కాలమైనను ఆ పాత, మంచి దినములు తిరిగి రావలెనని కోరుదుము. వివాహమైనవారు వివాహజీవితపు మొదటి కొద్ది నెలలు, సంవత్సరముల వైపు చూచి, భవిష్యత్తులో ప్రభువు వారి నిమిత్తమై ఎంత గొప్ప ఆశీర్వాదమును ఉంచెనో గుర్తింపక ఆ పాత దినములే తిరిగి రావలెనని ఆశించుదురు. ఒకవేళ ప్రభువు నీ యెడల అత్యధికముగా మంచివాడుగా ఉండి, గతములో ఆయన బలముగా పనిచేయుటను నీవు చూచి యుండవచ్చును. భవిష్యత్తులో అంతకంటె ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరచియున్నాడని మాత్రము మరువకుము. కావున ఎంతో కుటూహలముతో గొప్పవాటి కొరకు ఎదురుచూడుము. పౌలు ''ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకు చూచినప్పుడే, నీ విశ్వాసము జీవము గలదిగా ఉండును. అట్టి నిరీక్షణ, విశ్వాసము నిన్ను దేవుని హృదయమునకు సమీపముగా ఉంచును. ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి, మనలను పరిపూర్ణతలోనికి తెచ్చు పర్యంతము ఆయన తృప్తి చెందడు. మన ఆత్మీయ స్వాస్థ్యమైన తన రాజ్యమంతటిని మనకివ్వవలెనని ఆయన కోరుచున్నాడు. అందుచేతనే ముందున్నవాటి కొరకై వేగారపడవలెనని మనలను కోరుచున్నాడు. ఆ పాత, మంచి దినములను తలంచుచు, మరియు ఏడు లేక ఎనిమిది సంవత్సరముల క్రిందటి అదే వైఖరిని కలిగియుండుట వలన అది మన ఆత్మీయ పురోభివృద్ధిని, ఫలవంతమైన స్థితిని ఆటంకపరచును.
మనకందరికి, ''మనష్షే'' యొక్క అనుభవము అవసరము. ఏమి సంభవించినను భవిష్యత్తులో ప్రభువు మన కొరకై శ్రేష్టమైన ఉద్దేశములు కలిగియున్నాడని జ్ఞాపకముంచు కొనవలెను. ఆయన నిత్యత్వము నుండదది మన కొరకు ఏర్పాటు చేసినవన్నియు సంపూర్ణముగా అనుభవించవలెనని కోరుచున్నాడు. కనుక ఆయన ''సమస్తమును మీవి'' అను చెప్పుచున్నాడు (కొలొస్స 3:21). ఏదేమైనను, ఏవలము ఈ మాటలు వల్లించుట చాలదు: మనము ఆయన వాగ్ధానమును కోరుకొనవలెను. దేవుడు ''నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును'' అని చెప్పుచున్నాడు (హెబ్రీ 6:14). ఇది దేవుని వాగ్ధానము మరియు దాని ప్రకారము నిత్యత్వమునకు ఎడతెగక తన ఆశీర్వాదములను మన యెడల విస్తరిపజేయును. ఈ కారణమును బట్టియే గతము ఎంత మంచిదైనను దానిని మనము మరచిపోవలెను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షించవలెను. ఆయన రాజ్యము నందు, సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యము యొక్క సంపూర్ణ భాగమును మనము కోరుకొనుచు ఉండవలెను.
Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status
Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm
Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World
To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com